Home » Pillow : దిండును ఎన్ని రోజులకోసారి మార్చుకోవాలి ?

Pillow : దిండును ఎన్ని రోజులకోసారి మార్చుకోవాలి ?

Pillow : తల కింద దిండు లేనిదే నిద్ర పట్టదు. కొందరు ఏకంగా రెండు మెత్తలు పెట్టుకుంటారు. ఇంకొందరు తల కింద దిండు లేకుండానే నిద్ర పోతారు. కానీ మనం నిత్యం వాడుతున్న దిండును ఎన్ని రోజులకోసారి మార్చు కోవాలో చాలా మందికి తెలియదు.

నిత్యం ఉపయోగించే దిండ్లపై పలు రకాల బ్యాక్టీరియా, ఆయిల్​, చర్మ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులు చేరుకుంటాయి. అదేవిదంగా పడుకున్నప్పుడు అనుకూలంగా ఉండటానికి తరచూ మెత్త మార్చడం ఎంతో అవసరమనిఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పాత దిండుల్లో దుమ్ము, మైట్స్​, ఆయిల్​, మృత చర్మ కణాలు ఉంటాయి. అలర్జీ, చర్మ సంబంధ వ్యాధులతో పాటు గజ్జిని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. దిండు సక్రమంగా లేకపోయినా ఇబ్బందులు తప్పవు. మనం ఉపయోగించే దిండును మార్చుకోవాల్సిన అవసరం తప్పనిసరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

దిండు గట్టి పడినా, ఫ్లాట్​గా అవ్వడం లేదా రంగు మారితే వెంటనే మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దిండును కనీసం ఒకటి నుంచి రెండేళ్లకు ఒకసారైనా మార్చడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *