Home » Jaggery : బెల్లం ముక్క…ఆరోగ్యం పక్కా…

Jaggery : బెల్లం ముక్క…ఆరోగ్యం పక్కా…

Jaggery : వాయు కాలుష్యం. హోటల్ కు వెళితే నాణ్యతలేని ఆహారం. ఇంటి నుంచి బయటకు వెళితే దుమ్ము. వీటన్నిటిని శరీరం తట్టుకోవడం ఈ రోజుల్లో కష్టమే అవుతుంది. అంతే కాదు ఆరోగ్యం కూడా చెడిపోతుంది. వీటి నుంచి శరీరం రక్షణ పొందాలంటే ఎదో ఒక మార్గాన్ని ప్రతి ఒక్కరు వెతుక్కోవాల్సిందే. ఆరోగ్యం పక్కా ఉండాలంటే బెల్లం ముక్క సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. వాయు కాలుష్యం నుంచి కాపాడుతుంది. బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం,ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గాలి వలన చెడు కలిగించే నష్టాన్ని నివారిస్తుంది. గొంతును శుభ్రం చేస్తుంది.

శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది. విషపూరిత మూలకాలను నివారిస్తుంది. బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. బెల్లం రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. బెల్లంలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. దీనివలన రక్తం శుభ్రం కావడంతో పాటు అభివృద్ధి చెందుతుంది

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *