Pumpkin : గుమ్మడికాయ తో దిష్టి తీసుకుంటాం. ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టుకుంటాం. వడియాలు చేసుకుంటాం. కూర కూడా వండుకుంటాం. కానీ వాటి గింజలు తింటే ఏమవుతుందో చాలా మందికి తెలియదు. గుమ్మడి గింజలు తిన్నవారు పోషకాల కోసం చేపల కూర తినాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గుమ్మడి గింజలల్లో ఉండే ప్రొటీన్లు, పీచు ఆకలిని, బరువును నియంత్రిస్తాయి. మధుమేహం సమస్యలను నివారిస్తాయి.ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తాయి. 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 164 కేలరీలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, గుండెకు మేలు చేస్తుంది.ఇందులోని ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు వాపు, చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గిస్తాయి.
ఎముకల సాంద్రతను నిర్వహించడానికి మూలకాలు అందిస్తాయి. ఇందులోని మెగ్నీషియం, భాస్వరం, జింక్ ఎముకల వ్యాధిని నివారిస్తుంది. నిరంతరం తీసుకోవడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి. గుమ్మడికాయ గింజలు జుట్టు రాలడాన్ని నెమ్మదిస్తాయి.
వీటిలో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అంటువ్యాధులను నివారిస్తుంది. ఇందులోని విటమిన్ ఇ వాపును తగ్గించడముతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఈ గింజల్లో ఐరన్, మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను తొలగించడంలో ఐరన్ సహాయపడుతుంది.