Gongura : గోంగూర అంటే పచ్చడి ఆహారం అనే చాలా మందికి తెలుసు. పుల్లటి ఆహారంగా ఇష్టంగా తింటారు. కానీ గోంగూరతో చాలా వంటకాలు తాయారు చేస్తారు. మాంసంతో కలిపి కూడా వంట చేస్తారు. కానీ గోంగూర లో ఉండే పోషకాలు తెలిస్తే క్రమం తప్పకుండ తింటారు. గోంగూర తింటే శరీరానికి జరిగే మేలు గురించి ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.
మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది. దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడే వారికి చాలామేలు చేస్తుంది. గోంగూరలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది.జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు. నొప్పులు, వాపుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఈ కూరలో పీచు కూడా అధికంగానే ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలను నివారిస్తుంది. గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. . హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.