Fruits : భోజనం చేసిన అనంతరం కొందరు పాలు తాగుతారు. మరికొందరు తాంబూలం వేసుకుంటారు. ఇంకొందరు పండ్లు తింటారు. కానీ భోజనం చేసిన తరువాత పండ్లు తింటే ఏమవుతుందో చాలా మందికి తెలియదు. భోజనం అనంతరం పండ్లు తింటే ఏమవుతుందో అనే విషయాన్నీ ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. ఆహారంతో పాటు పండ్లను తీసుకోవద్దని ఆయుర్వేద గ్రంధాలు కూడా చెబుతున్నాయి.
భోజనం చేసిన అనంతరం పండ్లు తింటే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. దింతో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో టాక్సిన్స్ ప్రభావం చూపుతుంది. పండ్లు తినడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి.పుల్లటి పండ్ల రసాలు ఈ ఆమ్లాన్ని పెంచుతాయి. పండ్లు తినడం వల్ల తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
మైగ్రేన్ సమస్య ఉంటే, సిట్రస్ పండ్లు, అవకాడోస్, రాస్ప్బెర్రీస్, ప్లమ్స్, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలి. సిట్రస్ పండ్లలో ఆక్టోపమైన్ ఉంటుంది, ఇది తలనొప్పికి కారణమవుతుంది. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఏర్పడి ఆహారం జీర్ణం కావడం సమస్య తలెత్తి శరీరానికి ఇబ్బందికరంగా తయారవుతుంది.