Child Artist : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో చిన్న తనం నుంచే అడుగుపెట్టారు. కొందరు చైల్ ఆర్టిస్ట్ గా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి నేటికీ కొనసాగిస్తున్నారు. కొందరు హీరోగా, మరికొందరు నటీ, నటులుగా ఎదిగారు. చైల్ ఆర్టిస్ట్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఒకరు మాత్రం ప్రస్తుతానికి సినిమా పరిశ్రమకు దూరంగానే ఉన్నారు. చైల్ ఆర్టిస్ట్ గా కడుపుబ్బ నవ్వించాడు. ఒక వైపు విద్యాభ్యాసం చేస్తూనే, నటనలో తన ప్రతిభను చాటుకున్నాడు. అతనే భరత్….
చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రవేశించిన భరత్ పలు తెలుగు సినిమాల్లో నటించాడు. గుడుంబా శంకర్, మిస్టర్ పర్ఫెక్ట్, కింగ్, ఢీ, పోకిరి, దుబాయ్ శీను, రెడీ వంటి తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించాడు. దాదాపుగా 85 కు పైగా సినిమాల్లో నటించాడు.
చిన్న వయసులో బొద్దుగా ఉండేది భరత్. ఇప్పుడు ప్రతిరోజూ జిమ్ కు వెళుతున్నాడు. సిక్స్ పాక్ బాడీతో యంగ్ హీరోలకు పోటీగా రెడీ అయ్యాడు. అతి తొందరలోనే సినిమాల్లో కనిపించడానికి తన గెటప్ ను సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం.