Bibipeta : మనిషి ప్రాణం ఎంతో విలువైనదని, వెలకట్టలేని ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పనిసరని బీబీపేట ఎస్సై ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం బీబీపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పోలీస్ శాఖ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్బంగ ఎస్సై ప్రభాకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ …..
మోటార్ సైకిల్ నడిపేవారు ఎలాంటి మత్తు పదార్థాలను వాడరాదన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని ఎస్సై ఈ సందర్బంగా వివరించారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అదే విదంగా గంజాయి, మత్తు పదార్థాలు అమ్మేవారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని, వీటి విషయంలో ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.
అదే విదంగా మోటార్ సైకిల్ నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కేసు నమోదు చేసి కోర్ట్ కు పంపిస్తామన్నారు. హెల్మెట్ వ్యక్తి ప్రాణానికి ఎంతో రక్షణగా ఉంటుందని, మీ తండ్రులు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించే విధంగా చూడాల్సిన భాద్యత మీదేనని ఎస్సై ప్రభాకర్ ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు ASI , హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.