poor : చిత్ర పరిశ్రమలో అవకాశం దొరకడమే ఒక అదృష్టం. వచ్చిన అదృష్టాన్ని కాపాడుకుంటారు కొందరి. మరికొందరు కాలదన్ను కుంటారు. చిత్ర పరిశ్రమలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోటీశ్వర్లు అయిన వారు ఎందరో ఉన్నారు. దుర్వినియోగం చేసుకొని ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారు సైతం చిత్ర పరిశ్రమలో ఉన్నవారు సైతం ఉన్నారు. కానీ ఒకప్పుడు తినడానికి తిండిలేని ఆ నటి ఇప్పుడు కోటీశ్వరురాలు.
ఆ కోటీశ్వరురాలు అయిన నటి ఎవరంటే భారతీ సింగ్. ఈ భారతీ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్. ఆమె కపిల్ శర్మ షో ద్వారా పాపులర్ నటి అయ్యింది. తన హాస్యంతో పాపులర్ అయ్యింది. హాస్యంతో నవ్వించే భారతి సింగ్ కు అభిమానులు కూడా ఎక్కువే ఉన్నారు.
కామెడీ షోలతో పాటు పలు రియాలిటీ షోల్లోనూ ఆమె ప్రేక్షకులను, తన అభిమానులను సైతం నవ్విస్తుంది.
అతి పేదరికం నుంచి వచ్చి మెల్ల, మెల్లగా ఎదిగింది. రియాల్టీ షో లో అడుగుపెట్టిన భారతీ సింగ్ తనదయిన శైలిలో హాస్యం పండిస్తూ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకొంది.