Mohan babu : హైదరాబాద్ లో టీవీ 9 ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేశాడు. దింతో మోహన్ బాబుకు పోలీసులు కూడా ఊహించని షాక్ ఇచ్చారు. గురువారం హత్య యత్నం కింద కేసు నమోదు చేశారు. బుధవారం 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు కూడా చట్ట ప్రకారం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
మోహన్ బాబు జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేయడం చర్చనీయాంశం అయ్యింది. పోలీస్ శాఖ కూడా న్యాయ సలహా తీసుకున్నారు. దింతో మోహన్ బాబు పై హత్య యత్నం కింద గురువారం కేసు నమోదు చేశారు.
రంజిత్ పై దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టారు. మోహన్ బాబు ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ వెల్లువెత్తింది. పోలీస్ లు న్యాయ సలహా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు పై పోలీసులు హత్య యత్నం కింద కేసు నమోదు చేశారు.