Home » chiranjeevi : 10 కోట్లు…. 50 కోట్లు… 100 కోట్లు….చిరు సొంతమే

chiranjeevi : 10 కోట్లు…. 50 కోట్లు… 100 కోట్లు….చిరు సొంతమే

Chiranjeevi : అప్పటి వరకు సినిమా పరిశ్రమకు హద్దులు లేవు. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరూ లేరు. ఎవరి అండ లేకున్నా ఎదురులేని కథానాయకుడిగా చిత్ర పరిశ్రమలో చోటు సంపాదించుకున్నాడు. పునాది రాళ్లతో పరిశ్రమలో పునాది వేసుకొన్నాడు. ఇంతింతయి వటుడింతయి అనే సామెత మాదిరిగా ఎక్కడికో ఎదిగిపోయాడు. ఎంత అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన ఒదిగిపోవడం ఆయనలో ఉన్నసంస్కారం. ఆ సంస్కారమే ఆయనకు అవార్డులు తెచ్చి ఇచ్చే విదంగా తాయారు చేసిందనే అభిప్రాయాలు చిత్ర కుటుంబలో కోకొల్లలు.

ఆయన తన స్వార్థాన్ని ఎప్పుడు చూసుకోలేదు. తనతో పాటు తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచారు. వారి ఎదుగుదలకు సహాయ, సహకారం అందించారు. అందుకే ఆయన పేరుకు తగ్గట్టుగా చిరంజీవి అయ్యాడు. 150 సినిమాలకు పైగా నటించి మెప్పించారు. అవార్డులు పదులల్లో, రివార్డులు వందలల్లో, లెక్కలేనన్ని సత్కారాలు, వెరసి ఏ ఊరిలో చుసినా, విన్నా అభిమానులు. చిరంజీవి వస్తున్నాడంటే ఇసుక వేస్తె రాలనంత జనం, ఇంత కంటే ఇంకా ఏ నటుడికి ఏమి కావాలి. ఏమి కోరుకుంటారు.

రాజకీయాల్లో అడుగుపెట్టి దేశానికి మంత్రిగా సేవలు అందించారు. బ్లడ్ బ్యాంకు తో రక్త దానం చేసి ఎందరికో ప్రాణం పోశారు. ఐ బ్యాంకు తో సమాజాన్ని చూడలేని వారికి ప్రపంచాన్ని చూపించాడు. కరోనా సమయంలో ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి సినీ పరిశ్రమను నమ్ముకున్న వారీగా తనవంతు సహాయాన్ని అందించారు. తనకంటూ ఏర్పరచుకున్న హద్దు దాటి సమాజ సేవ చేసి ఎందరినో ఆదుకున్నారు. ఆ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ముందుగా పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆ తరువాత పద్మ విభూషణ్ అవార్దుతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం మరింత సేవ ప్రజలకు చేయాలనే భాద్యత పెంచింది.

150 కి పైగా సినిమాలు తీసి తన నటనకు, డాన్స్, ఫయిటింగ్ లకు తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు చిరంజీవి. తెలుగులో చిరంజీవిని మించి ఏ నటుడు కూడా అత్యధిక కలెక్షన్ లు సాధించలేదు. కానీ చిరంజీవి ఒక్కడే అత్యధిక కలెక్షను లు సాధించారు. తాను సాధించిన కలెక్షన్ ల రికార్డులను తానే బద్దలు కొట్టుకోవడం విశేషం. ఏవిదంగా ఇప్పటివరకు ఏ నటుడు కూడా చిరంజీవి మాదిరిగా కలెక్షన్ ల రికార్డ్ లను బద్దలు కొట్టుకోలేదు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ముందుగా 10 కోట్ల రూపాయల వసూళ్ల రికార్డ్ ను సాధించింది చిరంజీవే కావడం విశేషం. అంతే కాదు ఆ తరువాత 50 కోట్ల రూపాయల రికార్డ్ ను ఆయనే సొంతం చేసుకున్నారు. అప్పటితో ఆగకుండా వంద కోట్ల రూపాయల రికార్డు ను కూడా సాధించి తన రికార్డ్ ను తానే బద్దలు కొట్టుకోవడం ఒక్క చిరంజీవికే సొంతం అయ్యింది. అందుకే ఆయనను సినిమా పరిశ్రమకు పెద్దన్నగా భావిస్తారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *