Tree : సాధారణంగా ఈ రోజుల్లో కొద్దీ పాటి స్థలం ఉంటె కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. మిద్దె మీద కూడా మొక్కలు పెంచి తమ ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నారు. కొన్ని చెట్లు ఇంటికి కుటుంబ సభ్యులకు మంచి ఫలితాలు అందిస్తాయి. మరికొన్ని చెడు ఫలితాలను చూపెడుతాయి. కానీ బొప్పాయి చెట్టు పెంచుకునే వారికి వేద పండితులు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అనే విషయాన్నీ ఈ విధంగా చెబుతున్నారు.
బొప్పాయి చెట్టు ఇంటి ముందు పెంచడం అశుభానికి సంకేతమని వేద పండితులు చెబుతున్నారు. పొరపాటున కూడా బొప్పాయి చెట్టు ఇంటి ముందు మొలిచినా దానిని తీసివేయమని చెబుతున్నారు. ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టు పెరగడం వల్ల ఆ ఇంటి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సమస్యలు మొదలవు తాయని వేదంలో చెప్పబడింది.
ప్రశాంతత కరువైపోతుంది. కుటుంబ సభ్యులు సంతోషాలకు దూరమవుతారు. ఇంటి కుటుంబ సభ్యులకు ఎవరితో ఒకరికి గొడవలు, అల్లర్లు మొదలవుతాయి. చేస్తున్న పనిలో ఎలాంటి ఫలితం కనిపించదు. ఖర్చులు పెరిగిపోతాయి. డబ్బు నిలువదంటున్నారు వేదపండితులు.