Home » Singareni : శ్రీరాంపూర్ సింగరేణి స్టోర్స్ లో కానరాని రక్షణ ఏర్పాట్లు

Singareni : శ్రీరాంపూర్ సింగరేణి స్టోర్స్ లో కానరాని రక్షణ ఏర్పాట్లు

Singareni : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని స్టోర్స్ లో రక్షణ ఏర్పాట్లను సంబంధిత అధికారులు పాటించడంలేదని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి శ్రీరాంపూర్ బ్రాంచ్ నాయకులు ఆరోపించారు. యూనియన్ నాయకులు స్టోర్స్ ను సందర్శించిన సందర్బంగా రక్షణ ఏర్పాట్లు బయటపడ్డాయి. అధికారుల పనితీరుపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె బాజీ సైదా మాట్లాడుతూ………

శ్రీరాంపూర్ ఏరియా స్టోర్స్ అధికారులు నిబంధనలను గాలికొదిలేసి విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అధికారుల పనితీరు గమనిస్తే కార్మికుల కోసం పనిచేయకుండా, కాలక్షేపం కోసం స్టోర్స్ కు వస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు. అస్తవ్యస్తంగా ఉన్న ఎలక్ట్రికల్ వైరింగ్ తో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. స్టార్ అధికారులు ఆడంబరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నదన్నారు. ఏరియా స్టోర్స్ లో ప్రతిరోజు వందల టన్నుల మెటీరియల్ మిషనరీస్ దిగుమతి చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో వెంటనే యాజమాన్యం టెండల్ సూపర్వైజర్ లను నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఏరియా స్టోర్ కి వచ్చే మెటీరియల్ నాణ్యత ప్రమాణాలు పరిశీలించడానికి సరైన ప్రామాణికాలు లేవని ఆరోపించారు. స్టార్ సంబంధిత అధికారులు తనికీలు చేయకుండానే అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు.

మెటీరియల్ నిల్వ ఉండే షెడ్ లో కనీస వసతులు లేకపోవడంతో సంబంధిత సిబ్బంది అవస్థలు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ నుంచి చాలాన్ , షార్ట్ ఫైర్, సర్దార్, ఓవర్ మెన్ లు రికార్డ్ నమోదు చేసే పుస్తకాలు కూడా సరిపడేంత సరఫరా కాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అరకొర వసతులు ఉండి, కనీస రక్షణ ఏర్పాట్లు లేని స్టార్ లో కార్మికులు, సిబ్బంది ఎలా విధులు నిర్వహిస్తారని వారు ఈ సందర్బంగా సంబంధిత ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఈ సమస్యలపై ఏరియా జనరల్ మేనేజర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శిలు కుమారస్వామి, ఎడ్ల సమ్మయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, నాయకులు రాజ్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *