Thirumala : తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోడానికి భక్తులు ఎంత కష్టమైనా భరిస్తారు. దర్శనం అనంతరం స్వామి ప్రసాదం కూడా కోరుకుంటారు. దర్శనం తో పాటు ప్రసాదం దొరికితే చాలు జన్మ ధన్యమైనట్టుగా భావిస్తారు భక్తులు. ప్రతిరోజూ సగటున 70 వేల మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటారు. దర్శనం కోసం ఎంత సమయం పట్టినా ఓపికతో క్యూ లైన్ లో ఉంటారు. వేసవి సెలవులతో పాటు పండుగల వేల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు గంటల తరబడి భక్తులు క్యూ లైన్ లో వేచి ఉంటారు.
ఇప్పుడు భక్తులకు కొద్ది సమయంలోనే దర్శనం కలిగే విధంగా తిరుమల, తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు ఏ ఇబ్బంది లేకుండానే స్వామిని సులభతరంగా దర్శించుకునే విదంగా టీటీడీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై దృష్టి సారించింది. స్వామి దర్శనం గంటలో పూర్తయ్యేలా చేసేందుకు ప్రయత్నిస్తున్న టీటీడీ,చర్చలు జరుపుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో నిపుణులైన విదేశీ ప్రతినిధుల బృందం టీటీడీ తో చర్చలు జరపడానికి సిద్ధమవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు దేవస్థానం ఐటి ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.
ప్రస్తుతం ఉన్న సిబ్బందితో అవసరం లేకుండానే ఏఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయబోతున్నారు. తిరుమల కొండపై ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అమలుచేయడానికి నాలుగు విదేశీ సంస్థలు పోటీపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విధానం అమలవుతే గంటలోనే భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది.