Money : డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే. సమయానికి మనవద్ద డబ్బు లేదంటే అప్పు అడుగుతాం. ఎవరైన అడిగితే మనవద్ద ఉంటె అప్పు రూపంలో ఇస్తాం. అయితే అప్పు ఇవ్వడానికి, తీసుకోడానికి వారంలో రెండు రోజులు అతి ముఖ్యమైనవి. ఆ రెండింటిలో ఒకటి మంగళ వారం, మరొకటి శుక్రవారం.
పొరపాటున చేతి నుంచి డబ్బులు కిందపడిపోతే ఎవరైనా హిందూ సంప్రదాయం ప్రకారం డబ్బు తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు. అప్పు కావాలని అడిగితే శుక్రవారం అసలే ఇవ్వరు. ఈ పద్దతి పురాతన కాలం నుంచి వస్తోంది. ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవి పూజ చేస్తారు. ఇలా పూజ చేసే వారు ఎవరికీ కూడా అప్పు రూపంలో డబ్బు ఇవ్వరు. ఇస్తే తిరిగి రాదనే నమ్మకం. అంతే కాదు అప్పు ఇస్తే లక్ష్మీ దేవి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఆర్థిక కష్టాలు మొదలవుతాయని నమ్మకం కూడా ఉంది.
కొందరు వ్యాపారస్తులు శుక్రవారం పేదలకు దాన, ధర్మాలు చేస్తుంటారు. తమ వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి లక్ష్మీ దేవి అనుగ్రహమే అనే నమ్మకం. పేదలకు శుక్రవారం కొందరు వ్యాపారస్తులు అన్నదానం చేస్తారు. మరొక వారం మంగళ వారం. ఈ రోజు కూడా అప్పు ఇవ్వరు. తీసుకోరు. మంగళ అంటే శుభం అని అర్థం. ఆరోజు డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి రాదనే నమ్మకంతో ఇవ్వడానికి కొందరు ముందుకు రారు. ఖర్చు కూడా చేయరు.