Ramjan : రంజాన్ పండుగ ముస్లిం కుటుంబాలకు ఎంతో పవిత్రమైనది. నెలరోజుల పాటు ఉపవాస దీక్షను భక్తి శ్రద్దలతో కొనసాగిస్తారు. చాలా నియమ, నిబంధనలతో దీక్షను నెల రోజుల అనంతరం నెలవంక కనిపించిన మరుసటి రోజు పండుగ చేసుకుంటారు. కుటుంబ సభ్యులు అందరు కూడా కొత్త దుస్తులు ధరిస్తారు.
ప్రతిరోజూ ఉపవాసం ఉంటారు. రోజూ ఉండే ఉపవాస దీక్షను మాత్రం ఖచ్చితంగా ఖర్జురా పండు తిని విరమిస్తారు. ఇలా ఎందుకు విరమిస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రంజాన్ ఉపవాస సమయంలో ఖర్జూరాలను ఉపవాసం విరమించడాన్ని సున్నత్‌గా పరిగణిస్తారు. ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ఖర్జూర పండ్లను చాలా ఇష్టపడేదని చరిత్రలో ఉంది. ఆయన ఉపవాసం ముగించే సమయంలో ఖర్జురాలను తినేవారు.
అంటే ఆయన ప్రతిరోజూ ఖర్జూరా పండ్లు తిని ఉపవాసం ముగించేవారు. ఖర్జూరంతో ఉపవాసం విరమించడం అప్పటి నుంచి సంప్రదాయంగా మారింది. దీనిని సున్నత్ గా పిలుస్తారు.. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.