Home » Leaf : తమలపాకుతో ఈ వ్యాధులన్నీ మాయం.

Leaf : తమలపాకుతో ఈ వ్యాధులన్నీ మాయం.

Leaf : పూజా సమయంలోనే తమలపాకును ఉపయోగిస్తాం. పాన్ టేలాలల్లో తాంబూలం కు వాడుతారు. మిగతా సమయాల్లో ఆ ఆకును పట్టించుకోము. సాధారణంగా తమలపాకు మొక్కను ఇళ్లల్లో పెంచుకోరు. కానీ తమలపాకును ఇళ్లల్లో పెంచుకోవడం వలన పూజలకు, ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది. తమలపాకును నీళ్ళల్లో మరిగించి ఆ నీటిని తాగితే ఎటువంటి వ్యాధి అయినా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తమలపాకులను నీళ్లలో వేసి మరిగించి తీసుకోవడం వలన మన శరీరానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తమలపాకులో నియాసిన్, కెరోటిన్, థయామిన్, కాల్షియం, విటమిన్ -సి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

తమలపాకులతో తయారుచేసిన నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించబడుతుంది. తమలపాకు నీరు శరీరాన్ని విషరహితం చేస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది, గొంతు నొప్పి తగ్గుతుంది.మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ సమస్యను నివారిస్తుంది.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *