Ramcharan : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు రాం చరణ్ నటించిన గేమ్ చేంజర్ అభిమానులను నిరాశ పరిచింది. చిత్ర బృందం ఆశలు కూడా అడియాశలే అయ్యాయి. అనుకున్న స్థాయిలో వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది గేమ్ చేంజర్ సినిమా. ఆ సినిమా నిర్మాణంలో లోపం ఎక్కడ ఉందొ తెలియదు. కానీ అలాంటి పొరబాట్లు చేయకుండా రాం చరణ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పుడు రాం చరణ్ ‘RC 16’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం.
సినిమాకు సంబంధించిన సన్నివేశాలను కొన్నింటిని పూర్తి చేశారు. మరి కొంత భాగాన్ని ఢిల్లీలో చిత్రీకరించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. పార్లమెంట్ భవనంలో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు. అందుకు సంభందించిన అనుమతులు కూడా పొందారు. అయితే ఢిల్లీతో పాటు పార్లమెంట్ భవనంలో జరిగే షూటింగ్ సన్నివేశాలు పూర్తయ్యే వరకు హీరో రామ్ చరణ్ ఢిల్లీలోనే ఉంటాడని చిత్ర బృందం సమాచారం.