Bibipeta : బీబీపేట మండలంలోని దోమకొండ, ముత్యంపేటలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, వైఆర్ జికేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో బుధవారం హెచ్ఐవీ, ఎయిడ్స్ పై కళాజాత ప్రదర్శన నిర్వహించారు. హెచ్ఐవి వ్యాప్తి, నివారణ జాగ్రత్తలు గురించి కళాబృందం సభ్యులు తమ పాటల రూపంలో అవగాహన కల్పించారు.
అదేవిదంగా ఇంటి పరిసరాల పరిశుభ్రత గురించి గ్రామస్తులకు వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రతి కుటుంబం ఆరోగ్యముగా ఉంటుందన్నారు. వ్యక్తిగత శుభ్రత గురించి గ్రామస్తులకు వివరించారు. వ్యాధి చిన్నగా ఉన్నపుడే ఆసుపత్రికి వెళ్లాలని కోరారు. వైద్యుడి సలహా లేకుండా వ్యక్తిగతంగా మందులు వాడరాదన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి యాదగిరి, ఐ సి టి సి కౌన్సిలర్ మేక నాగరాజు, ఎం ఎల్ హెచ్ పి జ్యోతి, లింకు వర్కర్ స్కీం సూపర్వైజర్ జ్యోతి, లింకు వర్కర్ బాలకిషన్, దోమకొండ మండల రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు బుర్రి రవికుమర్, డివిజన్ సభ్యులు కంది వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.