morning : ఉదయం నిద్రలేవగానే కొందరు దేవుళ్ళ ఫోటోలను చూస్తారు. మరికొందరు బెడ్ రూమ్ లో ఉన్న పిల్లల ఫోటో చూస్తారు. ఇంకొందరు భార్య మొహం చూస్తారు. ఇంకా చెప్పాలంటే అరచేతులను చూసుకొని కళ్ళకు అద్దుకుంటారు. ఉదయం నిద్ర లేవగానే ఇలాంటి వస్తువులను చూస్తే అశుభమే కలుగుతుందని వేదపండితులు చెబుతున్నారు. ప్రధానంగా రాత్రి నిద్రపోవడానికి ముందే ఇంటిలోని వస్తువులను సర్దుకోవాలి. లేదంటే కొన్ని చూడని వస్తువులు కనబడే అవకాశం కూడా ఉంది.
బెడ్ రూమ్ లో ప్రధానంగా డస్ట్ బిన్ ఉండరాదు. వాటితో పాటు పగిలిన అద్దం, చీపురు, విరిగిన వస్తువులు, విడిచిన దుస్తులు అసలే ఉండరాదు. ఒకవేళ ఇవి ఉంటె నిద్ర లేవగానే చూడరాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి బెడ్ రూంలో ఉండరాదు. సాధ్యమైనంత మేరకు భార్య పిల్లలను వ్యక్తిగతంగా చూడండి. లేదంటే బెడ్ రూంలో వాళ్ళ ఫోటో అయినా చూడటానికి ఏర్పాటు చేసుకోవాలి. ఆ రెండు అనుకూలంగా లేకుంటే దేవుడి ఫోటో చూడాలి. అనారోగ్యంతో ఉన్నవారిని మాత్రం చూడరాదని వేదంలో స్పష్టం చేయబడింది.