Chanakyudu : ప్రతి వ్యక్తి తాను చేస్తున్న పనుల్లో విజయం సాధించాలని కోరుకుంటాడు. కొందరు విజయం సాదిస్తున్నవారిని చూస్తూ ఈర్ష్య పడుతుంటారు. ఈర్ష్య పడేవారు జీవితంలో బాగుపడరు. ఇటువంటివారు ఎప్పుడు కూడా ఇతరుల మీదనే దృష్టి సారిస్తారు. వారి అభివృద్ధి కోసం పట్టించుకోరు. ఇటువంటి వారికి మూడు అలవాట్లు ప్రధానంగా ఉంటాయి. ఆ మూడు అలవాట్లను పక్కకు పెడితే అన్నిటా విజయం సాధిస్తారని ఆర్థిక వేత్త చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టం చేశారు.
1) తనకు తానూ గొప్ప వ్యక్తినని ప్రశంసించుకోరాదు. ఇది తన అహంకారానికి మొదటి అడుగు అవుతుంది. అంతే కాదు ఇతరుల వద్ద కూడా తానే గొప్ప వ్యక్తినంటూ, నాకే అన్ని తెలుసు అంటూ వాదన చేయరాదు. ఇది సమాజంలో చులకనకు గురిచేస్తుంది.
2) ఇతరులను విమర్శించరాదు. మన ఎదుట లేని వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మాట్లాడరాదు. అతని వ్యక్తిగత విషయాల గురించి కూడా ఇతరుల వద్ద మాట్లాడరాదు.
3) సాయంత్రం సమయం అయ్యిందంటే కుటుంబంతో గడపటానికి పరిమితం కావాలి. అపవిత్ర ప్రదేశాలకు వెళ్ళరాదు.ఇష్టమైన దేవుణ్ణి ధ్యానం చేయడానికి ఈ సమయాన్ని కేటాయించాలి.