Home » Rudraksa : రుద్రాక్ష ధరిస్తే ఈ నియమాలు తప్పనిసరి… లేదంటే చిక్కుల్లో పడుతారు.

Rudraksa : రుద్రాక్ష ధరిస్తే ఈ నియమాలు తప్పనిసరి… లేదంటే చిక్కుల్లో పడుతారు.

Rudraksa : రుద్రాక్ష మాల ధరిస్తున్నారా ? సమయం, సందర్భం లేకుండా ధరించరాదు. వేదపండితులు చెప్పిన ప్రకారం రుద్రాక్షను ధరిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. సరైన పద్ధతులు పాటించాలి. లేదంటే ధరించే రుద్రాక్ష వృధానే అవుతుంది. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం …..

ఉదయం సమయంలోనే రుద్రాక్షను ధరించాలి. ఉదయం ప్రశాంత వాతావరణంలో రుద్రాక్ష శక్తి గ్రహించబడుతుంది. ధరించడానికి ముందుగా పంచామృతాలతో పాటు గంగాజలంతో శుభ్రం చేయాలి. శుబ్రమైన గుడ్డతోనే తుడుచుకోవాలి. తిలకం దిద్దాలి. మేడలో వేసుకునే సమయంలో కచ్చితంగా సూర్యరశ్మి రుద్రాక్షకు తగలాలి. ఆ తరువాత ఓం నమః శివాయ అంటూ 108 సార్లు జపించాలి. జపం పూర్తయిన తరువాత మేడలో వేసుకోవాలి.

పూజలకు ప్రత్యేక మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో రుద్రాక్షను ధరించడం వలన భక్తుల పట్ల శివుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. రుద్రాక్ష శంకరునికి ఇష్టమైన ఆభరణం. ఇది రత్నం కంటే ఎక్కువ విలువైనది. అందుకే శ్రావణ మాసంలో రుద్రాక్షను ధరించాలని వేదపండితులు చెబుతున్నారు.

రుద్రాక్షను శ్రావణ సోమవారం రోజున ధరించడం విశేషం. సోమవారం శివుని ఇష్టమైన రోజు. కాబట్టి సోమవారం రుద్రాక్షను ధరిస్తేనే శివుని అనుగ్రహం లభిస్తుంది. రుద్రాక్ష ధరించిన వ్యక్తి సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి. మాంసాహారం, మద్యం మానివేయాలి. బేసిసంఖ్యలో రుద్రాక్షను ధరించాలి. ధరించే రుద్రాక్ష సంఖ్య 27 కంటే తక్కువ ఉండరాదు.

వేదంలో చెప్పబడిన ప్రకారం రుద్రాక్ష ధరించిన వ్యక్తి దీర్ఘాయువుతో జీవిస్తాడు. అటువంటి వ్యక్తి తేజస్సు బాగా పెరుగుతుంది. రుద్రాక్షను ధరించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. శని, రాహు, కేతు మొదలైన గ్రహాలతో ఉపశమనం కలుగుతుంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *