Avishelu : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ప్రస్తుత పరిస్థితుల్లో గుమ్మడి, సన్ ఫ్లవర్, కలోంజీ, డ్రై ఫ్రూప్ట్స్, అవిసెలతో పాటు ఇతరత్రా గింజలను తింటున్నారు. ఇవన్నీ కూడా మహిళలకు, పురుషులకు ఆరోగ్యపరంగా మంచివే. కానీ అవిసెలు స్త్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు.
ప్రతిరోజూ ఒక స్పూన్ అవిసె గింజలను తీసుకుంటే మహిళలు ఏంటో ఆరోగ్యముగా ఉంటారు. మహిళల్లో జీర్ణ సమస్యలు సర్వసాధారణం. ఇవి పేగులను ఆరోగ్యముగా ఉంచుతాయి. మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగవుతుంది.
చెడు కొలెస్ట్రాలను తొలగిస్తుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. హార్మోన్ల లో సమతుల్యత ఏర్పడుతుంది. క్రమరహిత రుతు చక్రాలకు సహాయం చేస్తుంది. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. షుగర్ ఉన్నవారికి అదుపు చేస్తుంది. జుట్టు రాలకుండా నివారిస్తుంది.