Amith sha : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైనది. ఆదివారం ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా అమిత్ షా నిజామాబాద్ కు ఆదివారం రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు పై నిజామాబాదు ప్రజలకు హామీ ఇచ్చారు. హామీ మేరకు పసుపు బోర్డు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అమిత్ షా ఆదివారం పసుపు బోర్డు ను ప్రారంభించనున్నారు.
అదే విదంగా అదే రోజు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. వాస్తవానికి డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన నాయకుడు. పీసీసీ చీఫ్ గా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా పదవులు చేపట్టారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన గులాబీ గూటికి చేరుకున్నారు. ఆయనను కేసీఆర్ రాజ్యసభ పదవి లో నియమించారు.
ఇప్పుడు డీఎస్ విగ్రహాన్ని బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా ఆవిష్కరించడానికి ఆయన తనయుడు బీజేపీ ఎంపీ అరవింద్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.