Home » Nirjala Ekadashi:ఆ ఒక్కరోజు ఉపవాసం…ఏడాది ఉపవాసంతో సమానం

Nirjala Ekadashi:ఆ ఒక్కరోజు ఉపవాసం…ఏడాది ఉపవాసంతో సమానం

Nirjala Ekadashi : శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని రోజంతా ఉపవాసం ఉంటారు. దుర్గాదేవి నవరాత్రి సందర్బంగా తొమ్మిది రోజులు కొందరు ఉపవాసంతో గడుపుతారు. వినాయక నవరాత్రి పురస్కరించుకొని కూడా భక్తితో ఉపవాసం ఉంటారు. తొలి ఏకాదశి పండుగకు కూడా ఉపవాసం ఉండి తమ భక్తిని చాటుకుంటారు. వారంలో ఒకరోజు ఉపవాస దీక్షతో ఇష్టమైన దేవునికి పూజలు చేస్తారు. ఈ విదంగా ఒక్కొక్కరు ఒక్కో విదంగా ఉపవాస దీక్షతో తమకు నచ్చిన దేవునికి పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు.

జూన్ 18న నిర్జల ఏకాదశి . ఈ రోజు విష్ణుమూర్తి, లక్ష్మి దేవిని కలిపి పూజలు చేస్తారు. కానీ నిర్జల ఏకాదశి రోజు అనేది ఉంటదని చాలా మందికి తెలియదు. అదేవిదంగా విష్ణుమూర్తితో కలిపి లక్ష్మి దేవిని పూజిస్తారు అనే విషయం కొందరు భక్తులకు తెలియదు. నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ ఇద్దరు దేవతా మూర్తులకు ఉపవాసంతో పూజలు చేసినచో పుణ్యం లభిస్తుందని వేదం చెబుతోంది. అదేవిదంగా నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఉంటె ఏడాది కాలం పాటు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటె వచ్చే పుణ్యంతో సమానమని వేదంలో పొందుపరచబడింది.

నిర్జల ఏకాదశి రోజు మహావిష్ణువు, లక్ష్మి దేవి ల ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు వ్రతం చేయడం వలన తెలిసి, తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇంటిలోని తులసి మొక్కకు ఆవునెయ్యితో 11 దీపాలు వెలిగించాలి. ఆ ట్ ఆ తరువాత తులసి చుట్టూ పదకొండు ప్రదక్షణలు చేయాలి. బియ్యంతో చేసిన పాయసాన్ని విష్ణుమూర్తికి సమర్పించాలి. అందులో తులసి దళాన్ని వేసి మహా విష్ణువుకు నైవేద్యంగా పెట్టడం వలన కుటుంబ సభ్యులు అందరు కూడా సుఖ సంతోషాలతో గడుపుతారు.

పంచాంగం ప్రకారం జాతకంలో దోషం ఉన్నవారు నిర్జల ఏకాదశి రోజు బ్రాహ్మణుడికి నీరు, పసుపు రంగుతో ఉండే పండ్లు, మామిడి పండ్లు, శర్కర్ దానం ఇచ్చినచో చాల పుణ్యమైన రోజులను గడుపుతారు.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *