Shivudu : పరమ శివుడు. బోళా శంకరుడు. అడిగిన వెంటనే వరాలు ఇచ్చేస్తాడు. మెడలో పాము. మాసిన జుట్టు. నడుముకు పులి చర్మం. తలపై గంగ. ముల్లోకాలకు అధిపతి. కానీ అప్పుడప్పుడు ఒంటిపై పుర్రెలు , ఎముకలు కనిపిస్తాయి. ముల్లోకాలకు అధిపతి ఆయిన ఆ పరమశివుడు అందరి దేవుళ్ళ మాదిరిగా ఎందుకు ఉండటంలేదు. మెడలో భక్తులు భయపడే మాదిరిగా పుర్రెలు, ఎముకలు వేసుకొని, స్మశానం బూడిద రాసుకొని, ఆ స్మశానంలో ఎందుకు తిరుగుతూ ఉంటాడు అనేది ఆ శివుణ్ణి నమ్ముకున్న భక్తుల అనుమానం.
పార్వతీ దేవికి అనుమానం వచ్చి ఒకరోజు ఈ విదంగా అడుగుతుంది. స్వామి మీ మెడలో పుర్రెలను, ఎముకలను మాలగా ధరించి ఉన్నారు. ఎందుకోసం, ఎవరి కోసం ఆ విదంగా ధరించి ఉన్నారు అని పార్వతి దేవి ప్రశ్నిస్తుంది. స్మశానంలో తిరగటం, ఒంటికి బూడిద రాసుకోవడం, ఇవన్నీ కూడా అశుభానికి లక్షణాలు. అటువంటి వాటిని మీరు ధరిస్తే మీ భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. అదే విదంగా మీ భక్తులకు కూడా అనేక అనుమానాలు వాటిపై ఉన్నాయి అంటూ ప్రశ్నిస్తుంది పార్వతి దేవి. అందుకు శివుడు పార్వతి దేవి అడిగిన ప్రశ్నకు నిర్మొహమాటంగా సమాధానం చెబుతాడు.
ప్రశాంతంగా ఉన్న దేవతలను రాక్షసులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఎప్పుడు కూడా దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరుగుతుండేది. రాక్షసులు కఠినమైన తపస్సు చేసి దేవతలను మెప్పిస్తారు. అందుకు ప్రతిఫలంగా రాక్షసులు వరం పొందుతారు. పొందిన వరాల ప్రభావంతో రాక్షసులు దేవతలను పీడిస్తుండేవారు.
రాక్షసులు పెట్టె బాధలు తట్టుకోలేక దేవతాలోకం అంత కలిసి విష్ణు మూర్తి వద్దకు చేరుకుంటారు. విష్ణు మూర్తిని కాపాడమంటూ వేడుకుంటారు. విష్ణు మూర్తి అలోచించి పరమ శివుడిని వెంటనే పిలిపిస్తాడు. నీతిగా మెదులుకొనే దేవతలను ఇబ్బందుల్లో పెట్టడానికే రాక్షసులు తపస్సు చేసి వరం పొందారు. అటువంటి వారికి మంచి జరగకుండా ఉండాలి. అంతేకాదు వారందరిని నరకానికి పరిమితం అయ్యేవిదంగా ఏదయినా ఉపాయం ఉంటె చెప్పాలని కోరుతారు. రాక్షసులు చేస్తున్నది మోసం. కాబట్టి మోసాన్ని, మోసంతోనే జయించాలి.
అందుకు విష్ణు మూర్తి కోరిక మేరకు పరమ శివుడు రాక్షసులకు జ్ఞానోదయం కావడానికి విష్ణు మూర్తి సలహా ఇస్తాడు. సలహా ప్రకారం శివుడు మెడలో పుర్రెలు, ఎముకలు వేసుకొని శరీరమంతా బూడిద రాసుకొని రాక్షసుల వద్దకు వెళుతాడు శివుడు. పుర్రెలు, ఎముకలతో ,బూడిదతో రాక్షసులను ఆకట్టుకుంటాడు శివుడు. అప్పటి నుంచి రాక్షసులకు ఏవిధమైన సహకారం దేవత మూర్తుల నుంచి అందలేదు. శివుడు ఆలా చేయడంతో రాక్షసుల శక్తి సామర్ధ్యాలు తగ్గి దశల వారీగా నశించి పోయారు. దీనితో దేవతలకు రాక్షసుల నుంచి వచ్చే వేధింపులు తగ్గిపోయాయి. అంటూ శివుడు పార్వతి దేవికి వివరిస్తాడు.