Mixed Curry : ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అధికంగా తింటే కూడా జీర్ణం కాదు. దాంతో అనారోగ్యానికి గురికాక తప్పదు. ప్రధానంగా వేరువేరు పదార్థాలను కలిపి వండుకొని తింటే కూడా కొందరికి విషమంగా కూడా అవుతుంది. ప్రధానంగా పూర్వ కాలంలోనే మన పెద్దలు ఒక విషయాన్ని చెప్పారు. అది నేటికీ కూడా అమలవుతున్నది. పెద్దలు చెప్పిన ఆ విషయాన్ని నమ్మి నేటికీ ఆ రెండింటిని కలిపి కూర వండుకోవడంలేదు. ఆ రెండింటిని కలిపి వండితే విషం అవుతుందని. ఆ విషయం తెలియక తింటే చనిపోతామనే నమ్మకం నేటికీ ఉంది. కానీ అందులో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం…..
పొట్లకాయ, కోడి గుడ్డు రెండు కలిపి వండుకోవండం లేదు. నేటికి కూడా ఆ రెండు కలిపి వండితే ఆ కూర విషమంగా మారుతుందని ఒక నమ్మకం. ఈ నమ్మకం అనేది మన పూర్వకాలం నుంచి వస్తోంది. విషమంగా తయారవుతదని ఎలా తెలిసిందో నేటికి కూడా అంతుపట్టడంలేదు. పొట్లకాయ, కోడి గుడ్డు రెండు కలిపి వండుకోరాదు. తినకూడదు అని మన పెద్దలు చెబుతున్నారు. తింటే విషం అవుతుందని అంటారు. ఆ రెండు కలిపి వండితే విషం అవుతుందో లేదో తెలియదు కానీ ముందు జాగ్రత్తగా తినకుండా ఉండటమే మంచిదనే అభిప్రాయం ఉంది. వండుకునే సాహసం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు.
పొట్లకాయ, కోడి గుడ్డు కలిపి కూర వండితే విషం మాత్రం కాదు. ఇది నిజం. శరీరంలో అనారోగ్యం ఉండి, రక్త ప్రసరనలో ఏమైనా మార్పులు ఉన్న వారు, ఇలా రెండింటిని వండినటువంటి కూరలతో కలిపి తింటే సమస్య ఎదురవుతుంది. ప్రధానంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు రెండు లేదా మూడు రకాలను కలిపి కూర వండుకొని తిన్నచో అనారోగ్య సమస్య ఎదురవుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. అలాంటి కూరను తింటే కూడా జీర్ణం కాకుండా ఉంటుందని, దీనితో అనారోగ్యానికి గురికావలసి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.