President : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో గోషమహల్ నుంచి రాజా సింగ్ ఒకరు. ఇటీవల ఆయన మాట్లాడుతున్న మాటలు పార్టీకి ఇబ్బందికరంగానే ఉన్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని ప్రధానంగా లక్ష్యం చేసుకొని మాట్లాడుతున్నారు. కొద్ధి రోజుల పాటు రాజా సింగ్ ను పార్టీ పక్కన పెట్టింది. ఆయన మాట్లాడే మాటలు హిందువుల గురించే ఎక్కువగా ఉంటాయి.
రాజాసింగ్ 1995 లో సంఘ్ పరివార్ అనుబంధ సంఘం హిందూ వాహినిలో చేరారు. 1995 నుంచి 2009 వరకు హిందూ వాహిని చీఫ్ గా భాద్యతలు నెరవేర్చారు. 2009 లో కౌన్సిలర్ టికెట్ బీజేపీ ఇవ్వలేదు. దాంతో ఆయన టీడీపీ నుంచి గెలుపొందారు. తిరిగి 2014 లో కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. 2014 లో మొదటిసారి బీజేపీ అభ్యర్థిగా గోష్ మహల్ ఎమ్మెల్యే గా గెలుపొందారు. 1998, 2010, 2012 లో జైలు కు వెళ్లారు. ఎమ్మెల్యే హోదాలో కూడా ఆయన 77 రోజుల పాటు జైలు లోనే ఉన్నారు.
ఇప్పుడు ఆయన నామినేషన్ వెయ్యాలా ? వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. రాజా సింగ్ తన అనుచరుల వద్ద మాట్లాడుతూ ఇదే విషయాన్నీ చెప్పారు. ఒకవేళ నామినేషన్ వేసినా ? వేయకపోయినా తానూ అడిగితే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వరని కూడా తెలుసని తన అనుచరుల వద్ద స్పష్టం చేయడం విశేషం.
పొలిటికల్ బ్యూరో
కొమ్మెర అనిల్ కుమార్, ఎమ్మే,బీఎడ్