kumbamela : ప్రయాగ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో స్నానం చేయడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుంది. అదే విదంగా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయని వేదంలో చెప్పబడింది. అయితే మహా కుంభమేళాలో స్నానం చేసిన తరువాత ఏమి దానం చేయాలని చాలా మందిలో ఒక సందేహం కూడా ఉంది. వేదం పండితులు ఈ విదంగా చెబుతున్నారు.
హిందూ సంప్రదాయంలో అన్నదానం చేయడాన్ని చాలా గొప్పగా భావిస్తారు. అంతే కాదు మహా దానం అని కూడా అంటారు. కుంభ మేళాలో స్నానం చేసిన అనంతరం అక్కడ ఉన్న పేద వారికీ అన్నదానం చేయడం ద్వారా శుభం జరుగుతుందని వేదంలో చెప్ప బడింది. అన్నదానం చేయడం వలన ఆధ్యాత్మిక సంతృప్తిని పొందుతారు. మన పూర్వీకులకు కూడా విముక్తి లభిస్తుంది.
వస్త్ర దానం కూడా చాలా మంచిదని వేద పండితులు చెబుతున్నారు. కుంభ మేళాలో స్నానం ఆచరించిన అనంతరం అక్కడ ఉన్న వారికి అవసరమైన వస్త్రాలను దానం చేయడం చాలా మంచిదని వేద పండితులు చెబుతున్నారు. బట్టలు దానం చేయడం వలన ఆధ్యాత్మికంగా ప్రయోజనం లభిస్తుంది.