Akveriyam in Home : పిల్లలు సరదాగా గడపడానికి ఈరోజుల్లో చాలా మంది తమ ఇళ్లల్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు కాలక్షేపము కోసం ఏర్పాటు చేసుకుంటుంటున్నారు. అక్వేరియం అంటేనే అందులో నీరు,చేప పిల్లలతో కలిపి తయారు చేయడం.కాబట్టి అక్వేరియాన్ని ఇంటిలో ఏర్పాటు చేసుకోవడం శుభమా ?. అశుభమా. అక్వేరియం ఏర్పాటుచేసుకోడానికి వాస్తు అవసరమా ? వాస్తు తో సంబంధం లేకుండా పెట్టుకోవచ్చా ?. వేదపండితులు, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం ఇప్పుడు తెలుసు కుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి దక్షిణం దిక్కులో అక్వేరియాన్ని పెట్టుకోరాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి తగిలే విదంగా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటి కుటుంబం మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అక్వేరియం లో పెట్టె చేపలను కూడా ఎరుపు, నలుపు రంగు ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. పరిశుభ్రత తప్పనిసరి. ప్రతి శుక్రవారం అక్వేరియం పెట్టెను శుభ్రం చేసుకోవడం శుభం.
ఎంత అందంగా తాయారు చేసుకున్నప్పటికిని పడక గదిలో మాత్రం అక్వేరియం పెట్టరాదు. అదేవిదంగా కొందరు మహిళలు వంట చేసుకుంటూ అక్వేరియం చూడవచ్చు అనే ఉద్దేశ్యంతో పెట్టుకుంటారు. ఆ రెండు గదుల్లో అసలే అక్వేరియం ఏర్పాటు చేసుకోరాదు. దానివలన లేని తలనొప్పి కొని తెచుకున్నట్టు అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.