Hanuman : శ్రీ రాముడి ప్రథమ భక్తుడు ఆంజనేయుడు అని ఎవరైనా చెబుతారు. ఆంజనేయుడికి హనుమంతుడు, భజరంగబలి, హనుమాన్, శ్రీ ఆంజనేయ , అంజనీ పుత్రుడు, పవన పుత్రుడు, సంకట్ మోచనుడు, రామ భక్త హనుమాన్, మహాబలి అని రకరకాలుగా భక్తులు ప్రేమతో, భక్తితో పిలుస్తారు. ప్రతి మంగళవారం భక్తితో పూజలు చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. ముప్ఫయ్ రోజుల నుంచి, ముప్ఫయ్ ఐదు రోజుల వరకు ఉపవాస దీక్షలు కూడా భక్తి తో నిర్వహించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇది ఇలా ఉండగా హనుమంతుడికి చిరంజీవి అనే పేరు ఎలా వచ్చింది అనేది కొందరికి మాత్రమే తెలుసు. హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అర్థం మరణం లేదు అని అర్థం. చిరంజీవి అనే పేరు రావడానికి కారకులు ఎవరు ?. అందుకు సంబంధించిన కథ ఒకటి ఉంది. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.
రామాయణం గ్రంథం ప్రకారం రావణాసురుడు ఎవరు లేని సమయంలో వచ్చి సీత దేవిని అపహరించుకొని వెళుతాడు. శ్రీరాముడి ఆదేశముతో సీతాదేవి ఎక్కడ ఉందొ తెలుసుకోడానికి ఆంజనేయుడు బయలుదేరి వెళుతాడు. అతనితోపాటు వానరులు కూడా వందల సంఖ్యలో సీతా దేవి కోసం బయలుదేరుతారు. వెదుకుతున్న క్రమంలోనే హనుమంతుడు లంకకు వెళుతాడు. మహా సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటాడు. రవాణాసురిడికి చెందిన అశోక వనంలో ఉన్న సీతాదేవిని చూస్తాడు. రాముని దూతగా వచ్చానంటూ ఆవేదనలో ఉన్న సీతాదేవికి హనుమంతుడు వివరిస్తాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న సీతాదేవిని ఓదారుస్తాడు. అభయం ఇస్తాడు. సీతాదేవి కన్నీళ్లు తుడుస్తాడు.
రావణాసురిడి నుంచి తొందరలోనే తీసుకెళ్లడానికి శ్రీ రాముడు వస్తాడు అంటూ అభయమిస్తాడు. అయినా భయంతో గడుపుతున్న సీతాదేవి హనుమంతుడు చెప్పే మాటలు నమ్మదు.నిన్ను నమ్మేది ఎలా అంటూ సీతాదేవి ప్రశ్నిస్తుంది. అప్పుడు రాముడు ఇచ్చి పంపిన ఉంగరాన్ని సీతా దేవికి బహుకరిస్తాడు. అప్పుడు హనుమంతుడిని నమ్ముతుంది. హనుమంతుడు చూపిన ప్రేమ, భక్తిని చూసి సీతా దేవి ముగ్డురాలవుతుంది. అప్పుడు సీతాదేవి హనుమంతుడిని ఆశీర్వదిస్తూ చిరంజీవిగా మరణంలేని వ్యక్తిగా జీవించమని ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి హనుమంతుడికి చిరంజీవి అనే పేరు కూడా భక్తులు పలకడం మొదలైనది.