Srisylam : శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దర్శనానికి భక్తులు బారులు తీరి ఉన్నారు. ఆదివారంతో విద్యాసంస్థలకు సెలవులు ముగుస్తున్నాయి. శని, అది, సోమవారాల్లో కుంకుమ పూజ, అభిషేకాలతో పాటు స్పర్శ దర్శనం కోసం భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్పర్శ దర్శనానికే అనుమతి ఇస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ఈఓ శ్రీనివాస రావ్ తో పాటు ఇతర అధికార వర్గం నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బి సోమవారం వరకు ఆర్జిత సేవలతో పాటు కుంకుమ పూజలను రద్దు చేస్తున్నట్టుగా ఈఓ శ్రీనివాస్ రావ్ ప్రకటించారు. దర్శనానికి ఐదు నుంచి ఆరు గంటల వరకు సమయం పడుతుండటంతో క్యూ లైన్, కంపార్టుమెంట్ లల్లో ఉన్న భక్తులకు అల్ఫాహారం, పాలు మంచినీరు సరఫరా చేస్తున్నారు.
భక్తులు వేకువ జామునే పాతాళ గంగకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. దర్శనం కోసం బారులు తీరుతున్నారు. సుమారు ఐదు గంటలకు పైగా వేచి ఉంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.