Ayuda pooja : పండుగలన్నిటికంటే పెద్ద పండుగ ఏదని ఎవరిని అడిగిన క్షణాల్లో చెప్పేస్తారు దసరా పండుగ అని. ఎందుకంటే ఏ పండుగకు లేనంత గొప్పతనం ఆ పండుగకు స్పష్టంగా కనబడుతుంది. తొమ్మిది రోజులు బతుకమ్మ, దేవి నవరాత్రులు, దసరా పండుగ రోజు కొత్త బట్టలు ధరిస్తారు. జమ్మి చెట్టు పూజ చేస్తారు. సాయంత్రం రావణ దహన కార్యక్రమం నిర్వహించడంతో దసరా పండుగ సంబరాలు ముగుస్తాయి.
అయితే ఈ ఏడాది విజయ దశమి ఈరోజు వచ్చింది. రావణ దహన కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారు.. వాటి పూజ ముహర్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం దసరా పండుగను ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున ఘనంగా భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.
ఆశ్వయుజ మాసం దశమి తిథి అక్టోబర్ పన్నెండున ఉదయం 10:58 గంటలకు మొదలవుతుంది. మరుసటి రోజు అనగా అక్టోబర్ పదమూడున ఉదయం 9:08 వరకు ముహూర్తం ఉంది. ఉదయం తిథి ప్రకారం ఈ ఏడాది దసరా పండుగను అక్టోబర్ పన్నెండున శనివారం జరుపుకోడానికి ముహూర్తం ఉంది.
హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రదోష కాలంలో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముహూర్తం. వేద పండితుల పంచాంగం ప్రకారం అక్టోబర్ 12 న రావణ దహనం కార్యక్రమం చేపట్టడానికి శుభ సమయం సాయంత్రం 5:53 గంటల నుంచి 7:27 గంటల వరకు ఉంటుంది.
మధ్యాహ్నం 2:03 నుంచి 2:49 గంటల వరకు ఆయుధ పూజను నిర్వహించుకునే శుభ సమయం. ఆయుధ పూజను 46 నిమిషాలల్లో ముంగించాలని వేద పండితుల పంచాంగం లో చెప్పబడింది.