2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
వృచ్చిక రాశి
విశాఖ 4వ పదం,అనురాధ,జ్యేష్ఠ
ఆదాయం 8, వ్యయం 14,రాజపూజ్యం 4, అవమానం 5
ఈ రాశి వారికీ యాబై శాతం పైబడి అదృష్టయోగం ఉంది.ఆదాయం తక్కువగా ఉండటంతో ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు భారం తగ్గించుకుంటేనే ఆర్థికంగా మేలు జరుగుతుంది.చేసే వృత్తిలో జాగ్రత్త అవసరం.వృత్తిలో శ్రమకు తగినవిదంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి ఉంది. పెట్టుబడులు పెంచినచో వ్యాపారస్తులకు కలిసివస్తుంది.విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి విదేశీ ప్రయత్నాలు అనుకూలం.మే నెల తరువాత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉత్తరార్థంలో పెళ్లిగడియలు ఉన్నాయి. భూమి,గృహ,వాహన యోగాలు ఉన్నాయి.వ్యవసాయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన భాగ్యముంది. విద్యార్థులకు అవకాశాలు బాగున్నాయి. మంచి విద్య యోగం ఉంది. మనోభిష్టం సిద్ధిస్తుంది.గురు,శని,రాహువులను పూజిస్తే మంచి ఫలితాలు కనబడే అవకాశాలు ఉన్నాయి.