2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
వృషబం రాశి
కృతిక 2,3,4 పాదాలు రోహిణి,మృగశిర 1,2 పాదాలు
ఆదాయం 2 , వ్యయం 8,
రాజపూజ్యం 7,అవమానం 3
వృత్తిలో కష్టపడాల్సి ఉంటుంది. వ్యవసాయరంగంలో మిశ్రమ ఫలితాలు.పంట దిగుబడి ఆశాజనకంగా ఉండదు.విదేశీయాగం అనుకూలం.ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. భూమి,గృహ,వాహన యోగాలు ఉన్నాయి.ఉద్యోగంలో తగిన గుర్తింపు ఉంది. అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆలోచన పరంగా చేసే నూతన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవివాహితులకు పెళ్లి గడియలు అనుకూలంగా లేవు.పెళ్ళికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి.ఉన్నత చదువులు చదివేవారికి గురుబలం అనుకున్నంత మేరకు లేదు.మంచి ఫలితాలు రావాలంటే విద్యార్థులు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. శుభఫలితాల కోసం గురు,శని,కేతు శ్లోకాలు చదవడం మంచిది.ఈ రాశి వారికీ అదృష్ట యోగం 2 శాతమే ఉంది.కాబట్టి చేసే ప్రతి పనిలో చాల జాగ్రత్తలు తీసుకోవాలి