2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
తుల రాశి
చిత్త 3,4 పాదాలు,స్వాతి,విశాఖ 1,2,3 పాదాలు
అదాయం,వ్యయం 8,రాజపూజ్యం 1,అవమానం 5
పూర్వార్థంలో ఉత్తమ విద్యాయోగం ఉంది.వ్యాపారంలో పెట్టుబడులకు తగిన లాభాలున్నాయి.వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడి తిరిగివస్తుంది. లాభాలు కూడా ఘననీయంగా ఉంటాయి. వ్యాపారస్తులు తాము ఎంచుకున్న వ్యాపారంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమేలేదు.ఈ రాశివారికి ఈ ఏడాది పెళ్లి యోగం ఉంది. సంతానవృద్ది కలుగుతుంది. ఉద్యోగంలో అధికార లాభం ఉంది. వృత్తిలో దశలవారీగా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి.విదేశాల్లో స్థిరపడాల్సినవారు చేసే విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి..తీర్థ యాత్రలు చేసే అవకాశం ఉంది. గురు,శని కేతువులను పూజిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది.