cooking oil : ఉన్నత కుటుంబం వారు ఎలాగూ కొంటారు. కానీ మధ్యతరగతి వారితో పాటు పేద వారు సైతం వంటనూనె కొనలేని పరిస్థితి నెలకొంది. వంటనూనె ధర ఒక్కసారిగా వేడెక్కింది. గతంలో రోజుకు కొంత ధర పెరిగిన సందర్భాలు ఉన్నవి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనె పెరిగింది. ఆ తరువాత తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఒకేరోజు అంటే రాత్రికి రాత్రి అమాంతం ధర పెరిగింది. కొనుగోలుదారులు వంట ఎలా చేసుకోవాలి అంటూ తలపట్టుకుంటున్నారు.
హోల్ సేల్ వ్యాపారస్థులు నిల్వ ఉన్న నూనెకు కూడా ధర పెంచేశారు. రిటైల్ ధర శుక్రవారం రాత్రి వరకు రూ : 112 ఉంది. శనివారం ఉదయానికి హోల్ సేల్ ధర రూ : 121 చేరింది. రిటైల్ షాప్ వారు లీటర్ నూనె రూ : 125 కు అమ్మారు . శనివారం కొనుగోలు దారులు ధర తెలిసి పలు దుకాణం యజమానులను నిలదీశారు. ఒక్కరోజులోనే ఇంత ధర పెరగడంతో అసంతృప్తికి లోనయ్యారు ప్రజలు.
వంటనూనె ఎందుకు పెరిగిందంటే. కేంద్ర ప్రభుత్వం వంటనూనె దిగుమతి సుంకము పెంచేసింది. ఎంతో కొంత పెంచితే పరవాలేదు. ప్రస్తుతం వంటనూనె దిగుమతి సుంకం 12.5 ఉంది. మరో 20 శాతం కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. దింతో ఏకంగా 32.5 కు దిగుమతి సుంకం చేరడంతో హోల్ సేల్ వ్యాపారస్తులు కూడా రాత్రికి రాత్రే లీటర్ నూనె ధర కూడా పెంచేశారు.