AKSHYA TRUTIYA : హిందూ కుటుంబాలకు అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైనది. సంప్రదాయం ప్రకారం ఆరోజు లక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి, ధన త్రయోదశి మాదిరిగానే ఈ అక్షయ తృతియను కూడా హిందువులకు చాల పవిత్రమైనదిగా నమ్మకం. కొందరు బంగారం కొనుగోలు చేసి తమ మొక్కులు తీర్చు కుంటారు. మరి కొందరు వెండి కొంటారు. ఇలా ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు వెండి,బంగారం కొని అమ్మవారికి కానుకగా చెల్లిస్తారు. ఇంకొందరు బంగారం, వెండి ఆభరణాలను చేయించు కుంటారు. కానీ శాస్త్ర ప్రకారం, లేదా వేదపండితులు చెప్పిన ప్రకారం బంగారం, వెండి కొనకుండా ఇష్టమయిన వాటిని కొనుగోలు చేసిన మంచి జరుగుతుంది.
ఈ సంవత్సరంలో మే పదో తేదీన అక్షయ తృతీయ వచ్చింది. ఆ రోజు లక్ష్మి దేవిని అలంకరించి, భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలనే నిబంధన అంటూ ఏమిలేదని పండితులు చెబుతున్నారు. ఇంటికి ఉపయోగపడే కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేయవచ్చును. నూతన గృహం, గృహ ప్రవేశం, గృహ నిర్మాణం పనులు ప్రారంభం, మోటార్ బైక్, కార్, కంప్యూటర్, ల్యాప్ టాప్ ఇలా కొత్తవి కొనుగోలు చేయవచ్చును. వాటిని అమ్మవారి ముందు పెట్టి పూజలు చేసినచో ఏడాదిపాటు శుభం జరుగుతుంది.
హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి కొంటే ఎంతో మంచిదని చాలా మంది అనుకుంటారు. దీపావళి, ధన త్రయోదశి మాదిరిగానే అక్షయ తృతీయను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీన వచ్చింది. ఈరోజున చాలా మంది లక్ష్మీ దేవిని పూజించి.. పేదలకు దాన ధర్మాలు చేస్తారు. అలాగే బంగారం, వెండి కొంటూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాకుండా ఈ వస్తువులు..
అక్షయ తృతీయ మే పదో తేదీన వస్తుంది. ఆ రోజు ఉదయం 10. 54 గంటల వరకు రోహిణి నక్షత్రం ఉంటుంది. ఆరోజు మీరు ఏదయినా కొత్త వస్తువులు కొనుగోలు చేయాలంటే రోహిణి నక్షత్రం ముహూర్తం లోపు కొనుగోలు చేయడానికి వెలితే చాల మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మీకు కుటుంభం పరంగా ఎలాంటి వస్తువులు కానీ, బంగారం, వెండి కొనుగోలు చేసే అవసరం లేనప్పటికీ మీ శక్తి కొలది ఎంతో కొంత కొనుగోలు చేయండి. ఆలా కొనుగోలు చేయడం వలన లక్షి దేవి అనుగ్రహం లభిస్తుంది. కొనుగోలు చేయకున్నా అనాధ ఆశ్రమాలకు వెళ్లి అక్కడ ఉన్నవారికి అవసరమయిన వస్తువులు కొనివ్వండి. విద్యార్థులు ఉంటె వారికి పెన్ను, నోటు పుస్తకాలు, చదువుకు సంబందించిన వస్తువులు కొని ఇవ్వవచ్చు. లేదంటే ఆశ్రమంలో ఉన్నవారికి భోజనం, అల్ఫాహారం, పండ్లు కొనుగోలు చేసి పంపిణి చేసినా అమ్మవారి నుంచి ముక్తి లభిస్తుంది.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-