ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
వృషబం రాశి
కృతిక 2,3,4 పాదాలు రోహిణి,మృగశిర 1,2 పాదాలు
ఆదాయం 2 , వ్యయం 8,
రాజపూజ్యం 7,అవమానం 3
వృత్తిలో కష్టపడాల్సి ఉంటుంది. వ్యవసాయరంగంలో మిశ్రమ ఫలితాలు.విదేశీయాగం అనుకూలం. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. భూమి,గృహ,వాహన యోగాలు ఉన్నాయి.ఉద్యోగంలో తగిన గుర్తింపు ఉంది. అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆలోచన పరంగా చేసే నూతన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవివాహితులకు పెళ్లి గడియలు అనుకూలంగా లేవు.ఉన్నత చదువులు చదివేవారికి గురుబలం అనుకున్నంత మేరకు లేదు. శుభఫలితాల కోసం గురు,శని,కేతు శ్లోకాలు చదవడం మంచిది.ఈ రాశి వారికీ అదృష్ట యోగం 2 శాతమే ఉంది.
వృచ్చిక రాశి
విశాఖ 4వ పదం,అనురాధ,జ్యేష్ఠ
ఆదాయం 8, వ్యయం 14,రాజపూజ్యం 4, అవమానం 5
ఈ రాశి వారికీ యాబై శాతం పైబడి అదృష్టయోగం ఉంది. వృత్తిలో శ్రమకు తగినవిదంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి ఉంది. వ్యాపారస్తులకు కలిసివస్తుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలం.మే నెల తరువాత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉత్తరార్థంలో పెళ్లిగడియలు ఉన్నాయి. భూమి,గృహ,వాహన యోగాలు ఉన్నాయి.వ్యవసాయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన భాగ్యముంది. మంచి విద్య యోగం ఉంది. మనోభిష్టం సిద్ధిస్తుంది. గురు,శని, రాహువులను పూజిస్తే మంచి ఫలితాలు కనబడే అవకాశాలు ఉన్నాయి.
తుల రాశి
చిత్త 3,4 పాదాలు,స్వాతి,విశాఖ 1,2,3 పాదాలు
అదాయం 2 , వ్యయం 8,రాజపూజ్యం 1,అవమానం 5
పూర్వార్థంలో ఉత్తమ విద్యాయోగం ఉంది.వ్యాపారంలో పెట్టుబడులకు తగిన లాభాలున్నాయి. ఈ ఏడాది పెళ్లి యోగం ఉంది. సంతానవృద్ది కలుగుతుంది. ఉద్యోగంలో అధికార లాబమ్ ఉంది. వృత్తిలో దశలవారీగా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. తీర్థ యాత్రలు చేసే అవకాశం ఉంది. గురు,శని కేతువులను పూజిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
సింహ రాశి.
మఖ,పుబ్బ,ఉత్తర 1వ పాదం
అదాయం 2,వ్యయం 14,రాజపూజ్యం ,అవమానం 2
బృహస్పతి యోగంవలన మే వరకు మంచి ధన లాభం,సుఖ,సంతోషాలు ఉంటాయి. వ్యాపారరంగం కూడా మే వరకు అనుకూలంగా ఉంటుంది.చేసే వృత్తిలో జాగ్రత్తలు పాటించాలి. మే తరువాత విదేశీప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. అవివాహితులకు మే వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. భూమి,గృహ, వాహన కొనుగోలు చేసేవారు చాల కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులకు మే వరకు అనుకూలంగా ఉంది. మనోడైర్యంతో కష్టాలను అధిగమించాల్సి ఉంది. శని,రాహు,కేతు గ్రహాలకు ఒకసారి పూజ చేయడం మంచిది.
మిథునం రాశి
మృగశిర 3,4పాదాలు. ఆర్ద్ర,పునర్వసు 1,2,3పాదాలు
ఆదాయము 5, వ్యయం 5,రాజపూజ్యమ్ , అవమానం 6
ఉద్యోగంలో పదవిలాభం ఉంది. వ్యాపారంలో ధనలాభం సూచిస్తుంది. వ్యవసాయం కలిసివస్తుంది.కష్టాలు తొలిగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. మే తరువాత గురుబలం తగ్గుతుంది. కాబట్టి చేసే ప్రతిపనిలో జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి నైపుణ్యంతో ఉన్నత స్థాయిని చేరుకుంటారు.శత్రువులు మిత్రులవుతారు.శని,కేతు శ్లోకాలు చదివినచో శాంతి,సుఖం లభిస్తుంది.మిధున రాశి వారికీ 50 శాతం పైబడి అదృష్ట యోగం ఉంది
మేష రాశి:
అశ్విని,భరణి,కృతిక 1వ పాదం
ఆదాయం 8,వ్యయం 14
రోజపూజ్యం ,అవమానం 3
ధనలాభం శుభప్రదంగా ఉంది. 75 శాతం పైబడి అదృష్ట యోగం ఉంది. విద్యాయోగం బాగుంది.మే తర్వాత మంచి ఫలితాలు చేసే పనిలో కనబడుతాయి.వృత్తిలో రాణిస్తారు. ఉద్యోగంలో ఆలోచన విధానంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.పిల్లల అభివృద్ధి బాగుంటది.అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది. రైతులకు పంటదిగుబడి బాగుంటది. భూమి కొనిగొలు చేస్తారు. సంతాన యోగం ఉంది. శని యోగంతో ధనలాభం ఉంది. మార్చి 29 నుంచి ఈ రాశివారికి ఏలినాటి శని మొదలవు తుంది. శని ధాన్యం చేయడం మంచిది. విదేశీ యోగం చేసేవారికి కలిసివచ్చే అవకాశం కూడ ఉంది .
కర్కాటకం రాశి
పునర్వసు 4పాదం,పుష్యమి,ఆశ్లేష
ఆదాయం 14,వ్యయం 2, రాజపూజ్యం 6,అవమానం 6.
విద్యార్థులు చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు.వ్యాపారరంగంలో అభివృద్ధి.రైతులకు మేలు జరుగుతుంది.విదేశీయోగం అనుకూలమైతే సద్వినియోగం చేసుకోవాలి.గృహ యోగం ఉంది.ఈ రాశివారికి ఆనందం,ప్రేమ,శాంతి ఏడాది అంతా కూడా ఉంటుంది. అవివాహితులకు ఉత్తమ ఇల్లాలు దొరుకుతుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి.గురుగ్రహం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.కేతువు మూడో రాశిలో ఉండటం వలన ఆరోగ్యం,ధనం,పేరుప్రతిష్టలు పెరుగుతాయి.
మీనం రాశి
పూర్వాభాద్ర 4పాదం,ఉత్తరాభాద్ర,రేవతి
ఆదాయం 11,వ్యయం 5,రాజపూజ్యం 2,అవమానం 4
వాక్చాతుర్యం కాపాడుతుంది. విద్యార్థులకు మామూలు పరిస్థితులు ఉన్నాయి. ఉన్నత విద్యార్థులు కష్టపడాల్సి ఉంది .వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు.ఆరోగ్యపరంగా శ్రధ్ద తీసుకోవాలి. అవివాహితులకు మే వరకు పెళ్లి ముహూర్తం బలంగా ఉంది.మార్చి 29 నుంచి ఈ రాశి వారికీ ఏళ్ళ నటి శని మొదలవుతుంది. శని ధాన్యం చేసేవారికి మంచి ఫలితాలు ఉన్నాయి.చేసే ప్రతి పనిలో భూమి,వాహనం,ఇల్లు కొనుగోలు చేసేవారికి పూర్తి స్థాయిలో అనుకూలవాతావరణం లేదు. బృహస్పతి అనుకూలంగా ఉండటంతో పేరుప్రతిష్టలు, సుఖం, సౌభాగ్యం ఉంది.
కన్య రాశి
ఉత్తర 2,3,4 పాదాలు హస్త,చిత్త 1,2 పాదాలు
ఆదాయం 5,వ్యయం 5
రాజపూజ్యం 5,అవమానం 2
శని,గురు గ్రహాలు అనుకూలించడం వలన కన్య రాశి వారికీ యాబై శాతం పైబడి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. మే నుంచి గృహ,ధన లాభం ఉంది. మే వరకు మధ్యంతరంగా ఉన్నప్పటికినీ ఆ తరువాత ఫలితాలు బాగుంటాయి. పంటల దిగుబడి బాగుంటది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆనందం,సుఖం, ప్రశాంతత పొందుతారు.శని క్షేత్రంలో ఆరోస్థానంలో ఉండటంతో ఈ రాశివారు అదృష్టవంతులు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పదవీయోగం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ రాశి ఉద్యోగులు జాగ్రత్తలు పాటించాలి.
ధనుస్సు రాశి
మూల,పూర్వాషాఢ,ఉత్తరాషాఢ,1వ పాదం
ఆదాయం 11, వ్యయం
రాజపూజ్యం 7,అవమానం 5
బృహస్పతి అనుకూలంగా ఉండటం వలన విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.అవివాహితులకు ఉత్తమ ఇల్లాలుతో వివాహం. ఇంటిదేవత వలన సుఖం,సంతోషం,ఆరోగ్యం దొరుకుతుంది. ఉద్యోగంలో అధికార యోగం ఉంది. వ్యాపారస్తులకు మే వరకు మంచి లాభాలు వస్తాయి. భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉంది. మీ నమ్మకమే మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది.మే వరకు ఆర్థిక యోగం బాగుంటుంది. రైతులకు పంట దిగుబడి పెరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. భూమి,ఇల్లు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి.విదేశీప్రయాణం అనుకూలంగా ఉంది.
కుంభం రాశి
ధనిష్ట 3,4 పాదాలు శతభిషం పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం 14, వ్యయం 14,
రాజపూజ్యం 6 ,అవమానం 1
విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు విధినిర్వహాణలో నిర్లక్ష్యం పనికిరాదు. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. పిల్లల విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఏప్రిల్ మొదటి వరం నుంచి ఏళ్ల నటి శని ఈ రాశి వారికీ ఉంది. ఏడాదిలో ఒకసారైనా ఇష్టదేవతల దర్శనం చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు తొందర పనికిరాదు. దీర్ఘంగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవడం చాల మంచిది.
మకరం రాశి
ఉత్తరాషాడ 2,3,4, పాదాలు
శ్రవణం,ధనిష్ఠ 1,2, పాదాలు
ఆదాయం 14,వ్యయం 14
రాజపూజ్యం 3, అవమానం 1
అదృష్ట యోగం 50శాతం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉన్నాయి. పలు మార్గాల్లో అనుకున్న అభివృద్ధిని సాధిస్తారు. ఎదుటివారిని బుద్ధిబలంతో మెప్పిస్తారు. రైతులకు అనుకూలవాతావరణం. ఉత్తరార్థంలో అభివృద్ధి ఉంది. అవివాహితులకు మే తరువాత అనుకూలవాతావరణం ఉంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు. కష్టాలు తొలిగిపోయి,అభివృద్ధి సాధిస్తారు. కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రయాణంలు అంతగా అనుకూలించే అవకాశాలు లేవు. శని,కేతు,గురు శ్లోకాలు చదువుకుంటే శుభం కలుగుతుంది.