Office assistant : బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ మరియు భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. మైసూర్ లో బ్యాంకు నోట్ పేపర్ల తయారవుతాయి. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్టులకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, పల్ప్ అండ్ పేపర్, సివిల్, రసాయన శాస్త్రం, అకౌంట్స్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దరఖాస్తు చేసుకునే వారు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నెల వేతనం 24,500. దరఖాస్తు రుసుము 200 నుంచి 600 వరకు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్ సైట్ లింక్ : https://ibsonline.ibps.in/bnppagmay24/. మరిన్ని వివరాలకు ఇదే వెబ్ సైట్ లింక్ లో చూసుకోవాలని సంస్థ అధికారులు ప్రకటించారు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ జూన్ 30, 2024 గా అధికారులు ప్రకటించారు.