Home » యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్దు కల నిజమైనది

యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్దు కల నిజమైనది

xr:d:DAGBRDuLR64:74,j:2192551238629808304,t:24040712
  • 100 కోట్ల వసూళ్లు సాధించిన టిల్లు స్క్వేర్
  • జెట్ స్పీడ్ లో హీరో జొన్నలగడ్డ సిద్దు
  • కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్
    నేటితరం యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్దు సినిమా వస్తోందంటేనే అయన అభిమానుల్లో సందడి మొదలవుతుంది.ఆ హీరో సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అభిమానుల ఆశలకు తగ్గట్టుగానే సిద్దు నటించిన సినిమా టిల్లు స్క్వేర్ అభిమానులకు గిలిగింతలు పెడుతోంది.విడుదలైన పది రోజుల్లోనే సిద్ధుకు మంచి పేరు సాధించి పెట్టింది.మార్చి 29న టిల్లు స్క్వేర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనది. విడుదలైన కొద్దిరోజుల్లోనే బ్లాక్ బస్టర్ టాక్ ప్రేక్షకుల్లో అందుకుంది.బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురుస్తోంది.

వంద కోట్ల వసూళ్లు

తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు నాలుగు కోట్ల పైబడి కలెక్షన్లు సాధించింది.ఈ రెండు రాష్ట్రాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు కలిపి అరవై కోట్ల పైబడి టిల్లు స్క్వేర్ సాధించడంతో జొన్నల గడ్డ తిరుగులేని కథానాయకుడిగా ఎదిగాడనే అభిప్రాయాలు చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్నాయి.రెండో వారంలో కూడా వసూళ్ల జోరు ఏ మాత్రం తగ్గలేదనే అభిప్రాయాలు సైతం సినిమా రంగంలో వ్యక్తం అవుతున్నాయి.ఉగాది పండుగ సెలవుల్లో కూడా వసూళ్ల పర్వం పెరిగే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ లో అభిప్రాయపడుతున్నారు. వసూళ్ల జోరు పెరగడంతో టిల్లు స్క్వేర్ సినిమా సిద్దును స్టార్ హీరో చేసింది.దేశంలోనే వసూళ్లు సాధించడంతోపాటు ఓవర్శిస్ లో కాసుల వర్షం కురుస్తోంది.ఇతరదేశాల్లో ఇరువై ఐదు కోట్ల పైబడి వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాల టాక్.

 

సిద్దు కళ నిజమైనది

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ- మల్లిక్ రామ్​ కాంబోలో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ బ్లాక్​బస్టర్ టాక్ అందుకుంది.మార్చి 29న విడుదలైన ఈ మూవీ పది రోజుల్లోనే రూ.100కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.ఇప్పటికీ తియేటర్లలో టిక్కెట్లు దొరకడం లేదంటున్నారు అభిమానులు.ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ రూ.100 కోట్ల మార్క్ దాటిపోయినట్టుగా సినిమా టీమ్ అహీకారికంగా ప్రకటించడం విశేషం.
ఒక మీడియా సంస్థకు సిద్దు జొన్నలగడ్డ 2022 లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో తన మనసులోని మాటలను విప్పాడు. తన కోరికలు,లక్ష్యం ఏమిటో కూడా ఆ మీడియా ఎదుట వివరించాడు.ఏనాటికయినా వందకోట్ల క్లబ్ కలెక్షన్లలో చేరడమే తన ఆశయం అని తన ఇంటర్వ్యూ లో నిర్మొహమాటంగా ప్రకటించాడు.అంతే సిద్దు ప్రకటించిన రెండేళ్లకే తన ఆశయం నెరవేరింది.సిద్దు నటించిన టిల్లు స్క్వేర్ సినిమా వంద కోట్లు సాధించి స్టార్ హీరో సినిమాలకు దీటుగా నిలిచింది.సిద్దు కూడా చిత్ర పరిశ్రమలో తిరుగులేని నాయకునిగా తయారుకావడం విశేషం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *