Home » Puspa : పుష్ప 2 రికార్డుల మోత

Puspa : పుష్ప 2 రికార్డుల మోత

Puspa : పుష్ప-2 రికార్డుల మోత మోగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ : వెయ్యి కోట్ల వసూళ్లను చేజిక్కించుకొంది. కానీ ఇప్పటి వరకు హిందీ చిత్ర పరిశ్రమలో ఏ సినిమా వసూళ్లు చేయనంత కలెక్షన్ పుష్ప-2 చేయడం విశేషం.

బాలీవుడ్ చిత్రపరిశ్రమ కలలో కూడా చూడని రికార్డ్ ఇప్పుడు చూస్తోంది. హిందీ పరిశ్రమలో పుష్ప-2 సినిమా రూ : 700 కోట్ల కలెక్షన్ దాటడం విశేషం. వంద నుంచి 600 కోట్ల వసూళ్లను చూసింది బాలీవుడ్ పరిశ్రమ. కానీ ఇప్పుడు పుష్ప-2 సినిమా 700 కోట్ల వసూళ్లను దాటిపోయింది. దింతో హిందీ పరిశ్రమలో ఆనందం వ్యక్తం అవుతోంది.

ఇదే ఏడాది స్త్రీ 2 తొలిసారి 600 కోట్ల క్లబ్బులో చేరింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించారు ఇందులో. బాహుబలి-2. బాలీవుడ్‌లో 500 కోట్ల క్లబ్ మొదలు పెట్టింది. 2014లో PK సినిమా తొలిసారి 300 కోట్లు వసూలు చేసింది. 2009లో విడుదలైన 3 ఇడియట్స్ తొలిసారి 200 కోట్లు వసూలు చేసింది. 2008లో గజిని హిందీ సినిమా 100 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టి మొదటిసారి తన సత్తా ఏమిటో చూపించింది.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *