Telangana : బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఆర్డినెన్స్ నివేదిక ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉంది. న్యాయపరమైన చిక్కులు కావచ్చు, మరో కారణం కావచ్చు , ఏదేని ఒక కారణంతో ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలుపకుండా ఫైల్ తిరిగి ప్రభుత్వానికి పంపితే పరిస్థితి ఏమిటనేది రాజకీయ వర్గాల్లో ప్రశ్న తలెత్తింది…..
ప్రస్తుతానికి ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య ఆరోగ్యకరమైన వాతావరణమే ఉంది. న్యాయపరంగా చూస్తేనే ఫైల్ కు ఆమోదం దొరకడం కష్టంగా ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ముందుగా రాజకీయ పరంగా మరో పద్దతిని ఎంచుకున్నట్టుగా సమాచారం. నేరుగా ప్రధాన మంత్రితో చర్చించి ఆమోద ముద్ర వేయించుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. సీఎం రాష్ట్ర సమస్యలపై రాజకీయ వాతావరణాన్ని పక్కకుపెట్టి నేరుగా మోదీ తో బేటీ అవుతున్నారు.
రాష్ట్రాల అభివృద్ధి కోసం మేము పార్టీల పరంగా ఆలోచించమని కూడా వీరిద్దరి బేటీలో మోదీ స్పష్టం చేశారు. ఆ విధంగా ఆర్థిక, శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించుకున్నారు సీఎం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తేనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎన్నికలను నిర్వహించడానికి బీసీ రిజర్వేషన్ అమలుకు సహకరించాలని సీఎం ప్రధాన మంత్రిని కోరనున్నారని రాజకీయ వర్గాల సమాచారం.