Ex CM KCR : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థత కు గురయ్యారంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అనారోగ్యంతోనే కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అయ్యారని కూడా వాట్స్ అప్ గ్రూప్ లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరగడానికి ప్రధాన కారణం కేసీఆర్ మీడియా ముందుకు రాకపోవడమే అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడంలేదు. పార్టీ శ్రేణులను కూడా కలువడంలేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు అస్వస్థత అనే ప్రచారం జరుగుతోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. .
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు పలు వాట్సాప్ గ్రూపుల్లో కేసీఆర్ కు అస్వస్థత అంటూ వైరల్ చేశారు. తరువాత సోషల్ మీడియాలో వైరల్ చేశారు. యశోద ఆసుపత్రి డాక్టర్లు ఫామ్ హౌస్ లోనే ఉండి కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారని కూడా వైరల్ చేశారు. ఈ వార్తలన్నింటిని కూడా కాంగ్రెస్ శ్రేణులే చేస్తున్నారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు వెంట, వెంట కండిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని గులాబీ శ్రేణులు తిప్పికొడుతున్నారు. అయినప్పటికీ కేసీఆర్ బయటకు రాకపోవడంతో ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది.
కేసీఆర్ సీఎం బాధ్యతల్లో ఉన్నప్పుడు కూడా బయటకు రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పదేళ్ల అధికార సమయంలో నాయకులను, మంత్రులను సైతం రోజుల తరబడి కలవని సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా కేసీఆర్ కు ఆరోగ్యం బాగులేదని ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలన్నారు. పార్టీ శ్రేణులు మాత్రం వాటన్నిటిని ఖండించాయి. కొద్దీ రోజులకు కేసీఆర్ ఆరోగ్యముగానే ఉన్నారని తేలిపోయింది. ఇప్పుడు కూడా కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పరువే పోతుందని గులాబీ వర్గాలంటున్నాయి.