congress : కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని అధికారంలో ఉన్నా, లేకున్నా పదవుల కోసం ఆశపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్ర, జాతీయ కమిటీ మారినప్పుడల్లా ఆశావహుల సంఖ్య భారీగానే ఉంటది. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త రథ సారథి భాద్యతలు చేపట్టారు. రాష్ట్ర కమిటీ కొత్తగా నిర్మాణం కాబోతోంది. ఆ కొత్త కమిటీలో పదవి కోసం ఆశపడే వారి కంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆ పదవి నాకు కావాలి, అంటే లేదు నాకే కావాలి అంటూ గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, కొత్త పీసీసీ బాస్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఎందుకు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారో, ఆ పదవి కి ఉన్న గౌరవం, ఆ పదవితో వచ్చే భవిష్యత్తు ఏమిటో ఇప్పుడు తెలుసు కుందాం .
ఒక్కసారి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాద్యతలు చేపడితే చాలు ఆ నాయకుడి జాతకమే మారిపోతుందని కాంగ్రెస్ నాయకుల్లో విశ్వాసం ఏర్పడింది. నాయకులను తృప్తి పరచడానికి రాష్ట్ర విభజన తరువాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కాంగ్రెస్ అధిష్టానం సృష్టించింది. మొట్టమొదటిసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ పదవితో ఆయన ఢిల్లీ పెద్దలతో సంభందాలు పెరిగాయి. ఇప్పుడు కేబినెట్ మంత్రి అయ్యారు. ఉత్తమ్ తరువాత బట్టి విక్రమార్క భాద్యతలు చేపడితే సీఎల్పీ నేతగా ఎదిగారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా లో ఉన్నారు.
అదేవిదంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొదట వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాద్యతలు చేపట్టారు. ఆ ఆతరువాత పీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టారు. ఇప్పుడు పీసీసీ భాద్యతలు చేపట్టే వరకు మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కొనసాగారు. ఈ విదంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాద్యతలు చేపట్టిన కాంగ్రెస్ నేతల తలరాతలు మారుతున్నాయి. అందుకనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ఆశపడుతున్న వారి సంఖ్య దాదాపుగా ఇరువై దాటి పోయిందని కాంగ్రెస్ లో పెద్ద టాక్ అయ్యింది. చూద్దాం ఆ అదృష్ట వంతుడు ఎవరు అవుతారో.