mlc kavitha : ఎమ్మెల్సీ కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్ట్ కావడం జైలు కు వెళ్లడం ఇది నాణానికి ఒకవైపు మాత్రమే జరిగింది. కానీ కవిత జైలు నుంచి బెయిల్ పై వచ్చినపుడు ఏమి మాట్లాడిందో ప్రజలందరికి తెలుసు. ఆవేశంగా మాట్లాడిందా. ఆలోచించే మాట్లాడిందా లేదంటే నోరు జారిందా అనేది కూడా ఆమెకే తెలుసు. నేను మొండి దాన్ని. అటువంటి దాన్ని నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు. అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు. వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను అంటూ ఆవేశంగా మాట్లాడారు. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఆమె బీజేపీ నే లక్ష్యముగా చేసుకొని మాట్లాడిందని అనుకున్నారు. కానీ ఆమె నేటి వరకు మౌనంగానే ఉన్నారు. ఆమె మౌనం అర్థం కొద్దీ రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండటమేనని గులాబీ శ్రేణుల సమాచారం.
గులాబీ పార్టీ అధికారం కోల్పోయాక అధికార పార్టీపై పోరాటం చేయడానికి ఎలాంటి ఆయుధం లేకుండా పోయింది. గులాబీ శ్రేణులు ప్రభుత్వం పనితీరుపై అప్పుడప్పుడు ఆరోపణలు చేశారు. కానీ అవి పార్టీ ఆశించినంత సత్పలితాలను ఇవ్వలేదు. కానీ కవిత జాగృతి తరుపున దూకుడు పెంచింది కాంగ్రెస్ ప్రబుత్వంపైన . జాగృతి సంస్థ తరుపున బిసి ఉద్యమాన్ని చేపట్టింది. పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది, వాటితోపాటు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని లెవనెత్తారు. ఇంతలోనే లిక్కర్ కేసులో అరెస్ట్ కావడంతో బిసి రిజర్వేషన్, పూలే విగ్రహాన్ని ఏర్పాటు వంటి అంశాలు మరుగున పడ్డాయి. ఆమె తరువాత ఆ ఉద్యమాన్ని ఎత్తుకోడానికి జాగృతి నాయకులు ఎవరు కూడా ముందుకు రాలేదు.
ఈ నేపథ్యంలో కొందరు బీసీ నేతలు, జాగృతి నేతలు కేటీఆర్ ను కలుస్తున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ బీసీ నేతలతో పాటు, జాగృతి నేతలు ఉద్యమం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. నవంబర్ 10 లోపు బీసీ లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని కేటీఆర్ హెచ్చరించారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు వింటుంటే ముమ్మాటికీ కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని కేటీఆర్ బుజాన ఎత్తుకున్నట్టేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేటీఆర్ బీసీ ఉద్యమం చేపడుతున్నదంటే కవిత కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.