Home » singareni : సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లించడానికి నిర్ణయం

singareni : సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లించడానికి నిర్ణయం

singareni : 2023 – 2024 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ సాధించిన లాభాల వాటాను చెల్లించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గురువారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గుర్తింపు సంఘంతో జరిగిన చర్చల్లో వాటాల చెల్లింపు పై నిర్ణయం జరిగిందన్నారు.

అక్టోబర్ మొదటి వారంలో కార్మికులకు లాభాల వాటా చెల్లించే విదంగా యాజమాన్యం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి కార్మికుడికి రూ : 1.88 లక్ష సగటున అందుతాయన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ : 5 వేలు లాభాల వాటా చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ సంఘం ఒప్పించడం జరిగిందన్నారు.

సింగరేణి సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ : 2388.5 కోట్ల లాభాలు సాధించడం జరిగిందని సీతారామయ్య వివరించారు. అందులో కార్మికుల వాటా 33 శాతం గా నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రతి కార్మికుడికి రూ : 1.88 లక్ష చేతికందుతున్నారు. కార్మికుల వేతనాల నుండి కోత లేకుండానే యాజమాన్యం వరద బాధితుల సహాయార్థం రూ : 10.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు. గుర్తింపు సంఘం గా గెలిచిన ఏఐటీయూసీ ప్రభుత్వాన్ని ఒప్పించి లాభాల వాటా చెల్లించే విదంగా చర్యలు తీసుకోవడం జరిగిందని యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య వివరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *