vemulavada:రాజన్న సిరిసిల్ల వేములవాడ దేవస్థానంలో భక్తులకు అందుబాటులో ఉంటూ సౌకర్యాలు కల్పించాల్సిన అధికారుల్లో నిర్లక్ష్యం బయటపడింది.చివరకు భక్తులకు పంపిణి చేసే లడ్డు ప్రసాదం లో కూడా అశ్రద్ధ కనబడింది.ఎప్పుడు ఆలయ నిర్వాహకులో ఎదో ఒక ఫిర్యాదు ఉన్నతాధికారులకు వెళుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో 2022 నవంబర్ లో విజిలెన్స్ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనబడింది.విజిలెన్స్ అధికారులు నివేదిక ప్రకారం వేములవాడ ఆలయం అధికారులు ముగ్గురు AEO లతోపాటు నలుగురు సూపర్ వైజర్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు అవుట్ సోర్సింగ్, ఒక బార్బర్ లపై చర్యలు తీసుకున్నారు.
కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించనందుకు ముగ్గురు AEO ల ఇంక్రిమెంట్లను నిలిపివేశారు. లడ్డు ప్రసాదం విభాగంలో విధులు నిర్వహిస్తున్న సూపర్ వైజర్, జూనియర్ అసిస్టెంట్ లకు జరిమానా విధించారు. వాళ్లకు ఇంక్రిమెంట్ కూడా వేతనంలో కోత విధిస్తూ నోటీసు జారీచేశారు
సస్పెండుకు గురైన వారు పదిహేను రోజుల్లోగా విధించిన జరిమానా చెల్లించాలని అధికారులు నోటిస్ లో తెలిపారు.పారిశుద్ధ్య రికార్డులు సరిగా లేనందుకు సంబందించిన సీనియర్ అసిస్టెంట్ ఇంక్రిమెంట్ లో సైతం కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు. సంబంధిత సూపర్ వైజర్ దేవాలయానికి జరిగిన నష్టానికి 21 వేయి రూపాయలను చెల్లించాలని,అదేవిదంగా గోడౌన్ లో పనిచేయాలని అహీకారులు ఆదేశించారు.
తల నీలాలు సమర్పించడానికి వచ్చిన భక్తుల నుంచి కూడా ఒక బార్బర్ అదనంగా వసూలు చేశాడు. అందుకు అతన్ని విధుల నుంచి తొలగించి,సంబంధిత సూపెరిండేంట్ కు సైతం మెమో జారీచేశారు.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-