brs party : గులాబీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అయినవి. స్థానికేతరుడు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా తయారైనవి. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతం వారిని నొప్పించకుండానే కేసీఆర్ వ్యవహరించారు. ఎప్పుడో ఒకసారి తన మాటలతో ఆంధ్ర వారిపై సామెతలు, పిట్టకతలతో ఇబ్బంది పెట్టిన సందర్భాలు అప్పుడప్పుడు జరిగిన సందర్భాలు ఉన్నవి.
రాష్ట్రం ఏర్పడిన తరువాత పదేళ్ళపాటు కేసీర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సీఎం హోదాలో ఏనాడూ కూడా సెటిలర్లను ఇబ్బందిపెట్టిన సందర్భాలు కనబడలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అంటే మాకు ఎంతో గౌరవమని గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నవి. అధికారం కోల్పోయింది బిఆర్ఎస్. ఎంత కాదనుకున్న కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యే. అధికారం పోగానే స్థానికులు, స్థానికేతరులు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇబ్బందికరంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పార్టీకి కూడా నష్టం చేసే విదంగా ఉన్నాయని గులాబీ శ్రేణులు కూడా కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.
జరిగిన నష్టం గులాబీ పార్టీకి జరిగి పోయింది. ఇప్పుడు చేతులు కాలిన తరువాత ఏ ఆకు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. నాకు సెటిలర్లు అంటే ఎంతో గౌరవం. వాళ్ళను ఉద్దేశించి నేను అనలేదు. నేను కేవలం అరికెపూడి గాంధీ ని ఉద్దేశించి మాత్రమే అన్నాను అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సెలవు ఇవ్వడం విశేషం.