rythu barosa : వ్యవసాయదారులకే రైతు భరోసా ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆశయం. కొండలు, గుట్టలకు, బీడు భూములకు, సేద్యం కాని భూములకు రైతు భరోసా అమలు చేయరాదనేది ప్రభుత్వ నిర్ణయం. ఎక్కడైతే రైతులు పంటలు పండిస్తున్నారో వారికే ఇవ్వాలనేది ప్రభుత్వ ఆశయం. గత ప్రభుత్వం హయాంలో రైతు పాస్ పుస్తకం, బ్యాంకు ఎకౌంట్ ఉంటే చాలు, రైతు బందు పథకం అమలు అయ్యేది. ఎకరానికి ఒక పంటకు ఐదు వేల రూపాయలు మంజూరయ్యేది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రైతు భరోసా అమలు చేయాలంటూ బిఆర్ఎస్ తో పాటు, బీజేపీ కూడా దుమ్మెత్తి పోస్తోంది. అయినా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులు కూడా స్పందించలేదు. రైతు బందు బిఆర్ఎస్ కు వజ్రాయుధంలా పనిచేసింది. ఇప్పుడు రైతు భరోసా పథకం పేరుతొ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళింది. ఎకరానికి రెండు పంటలకు కలిపి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చబోతున్నారు.
రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ పంటలు పండించే రైతులకే మంజూరు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యం. కొండలు, గుట్టలు, బీడు, సేద్యం కానీ భూములకు ఇవ్వరాదనేది తాజా ప్రభుత్వ నిర్ణయం. అదే విదంగా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది ఇంకా తేలాల్సి ఉంది. పది ఎకరాలకు లేదంటే ఐదు ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. దాదాపుగా ఐదు ఎకరాలకు మంజూరు చేసిన నేపథ్యంలో ప్రతి పేద రైతుకు పథకం చేరుతుందనేది ప్రభుత్వ ఆశయం.
ఇప్పటి వరకు ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.52 కోట్ల మంది రైతులు ఉన్నారు. వీరికి రూ : 22,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఐదు ఎకరాలకు పరిమితం చేసిన నేపథ్యంలో 62.34 లక్షల రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి రైతుకు పెట్టుబడి అందుతుంది. అదే విదంగా గత ప్రభుత్వం కంటే రూ : ఐదు వేలు ఎక్కువ ఇచ్చినట్టు పేరు వస్తుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసాను దసరా కానుకగా పంటలు పండించే ప్రతి రైతుకు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని ప్రకటించడం విశేషం.