Singareni : ఉద్యోగంలో చేరిన ఏ వ్యక్తికయినా పదోన్నతి కంటే ఉద్యోగ భాద్యతలు ప్రధానమైనవని సింగరేణి శ్రీరాంపూర్ వైద్యాధికారి డాక్టర్ కిరణ్ రాజ్ స్పష్టం చేశారు. అదనపు ముఖ్య వైద్యాధికారిగా పదోన్నతి పొంది బదిలీ పై వెళుతున్న సందర్బంగా ఆయనను శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ , ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన అసోసియేషన్ నాయకులును, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పదోన్నతి గురించి ఉద్యోగి ఎదురు చూడరాదన్నారు.
నిబంధనల మేరకు పదోన్నతి తనంతట తానే ఉద్యోగి వద్దకు వస్తుందన్నారు. వృత్తి ధర్మం నెరవేర్చడమే ప్రధానమన్నారు. సింగరేణి అధికారులకు, సూపర్ వైజర్లకు, కార్మికులకు, కార్మిక సంఘాల నాయకులకు సేవ చేయడం ఎంతో తృప్తిగా ఉందన్నారు. తన వృత్తికి ప్రతి ఒక్కరు ఎంతో సహకరించారని, అందుకే నాకు ముఖ్య అదనపు వైధ్యాధికారిగా పదోన్నతి లభించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ , ఎస్టీ అసోసియేషన్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ డేగల ప్రవీణ్ కుమార్, ఎస్సీ లైజన్ ఆఫీసర్ కె కిరణ్ కుమార్ , శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ నక్క సుమన్ , దరిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.